19, అక్టోబర్ 2020, సోమవారం

బాలవే నీ వెపుడు - గోలవే బేలవే - అడవి బాపిరాజు కవిత


 

కీ. శే. అడవి బాపిరాజు గారి అద్భుత కవిత కి నా pencil చిత్రం.


బాలవే నీ వెపుడు – గోలవే బేలవే!

పరమ సౌందర్యాలు – పడతి నీ కన్నులే

కన్నులలో దాగెనే – కమ్మని సిగ్గోటి

బాలవే నీవెపుడు – గోలవే బేలవే!

 

ఉదయ సంధ్యల ఎరుపు

పెదిమెలలో తేనెలే

తేనెలో ఒదిగింది – తీయ తీయని సిగ్గు!

బాలవే నీవెపుడు – గోలవే బేలవే!

 

తంత్రి స్పందించుతూ

తలవాల్చి పాడుతూ

నను ముంచు నీ పాట నవ్యమయ్యే సిగ్గు!

బాలవే నీవెపుడు గోలవే బేలవే!

 

నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు

అందాల నీ పెదవి అలమిపోయే సిగ్గు

దివ్య గాందర్వాన నవ్యమయ్యే సిగ్గు

సిగ్గులను మాలగా చేర్తువే నా గళము

బాలవే నీవెపుడు – గోలవే బేలవే






కామెంట్‌లు లేవు:

దళవాయి చలపతి రావు - తోలు బొమ్మలాట కళాకారుడు - పెన్సిల్ స్కెచ్

 మన ప్రాచీన కళలకు స్వస్తి చెప్పేస్తున్నామా? ప్రక్ఖ్యాత తోలు బొమ్మలాట కళాకారుడు 'పద్మశ్రీ' పురస్కార గ్రహీత దళవాయి చలపతిరావు -  (Drawn...