11, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీమతి షావుకారు (శంకరమంచి) జానకి



Shavukaru (Sankaramanchi Janaki) - Pencil sketch (drawn with mechanical pencil) a few years ago.

ఈ రోజు అద్భుత నటి శ్రీమతి షావుకారు (శంకరమంచి) జానకి గారి పుట్టినరోజు. నా ఈ బ్లాగు ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఈ సందర్భంగా మిత్రులు డా. KVS Prasad గారు జానకి గారు చెప్తున్నట్టుగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇది చదువుతుంటే జానకి గారి soliloquey (స్వగతం) అనిపించింది. ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు అందించిన వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.


"డోంట్ వాష్ ద డర్టీ లినన్ ఇన్ పబ్లిక్......ఇదే నే చెప్తుంటా. ఇప్పుడు యు- ట్యూబ్ లో చూస్తుంటే....మనసుకు ఎంతో కష్టమేస్తుంటుంది.
మన స్వవిషయాలే....మనం పబ్లిక్ చేసుకుంటే....విజ్ఞత కాదు కదా! మరి పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన....ఇతరుల గురించి...చెత్తగా ఎలా మాట్లాడుతారండి...ఈ సో కాల్డ్ ..సూడో ఎక్స్ జర్నలిస్టులు?!
వీళ్ళకేం అధికారముందని....గతించిపోయిన ఆర్టిస్టుల గురించి...వారి వ్యక్తిగత జీవితాల గురించి సీక్రెట్స్ అంటూ...నానా చెత్తా మాట్లాడుతారండి.
ఇతరుల జీవితాల నుండి సొమ్ము చేసుకునే పధ్ధతా ఇది!?
వీడు ఆ లెజెండ్స్ కు ఎంతో దగ్గరైనట్లు....ఎన్నో సీక్రెట్లూ అవీ వీడితో షేర్ చేసుకున్నట్లు....చెత్త వాగుడు వాగితే ఎట్లా!?
ఎంత పబ్లిక్ ఫిగర్స్ అయినా...లెజెండ్స్ అయినా...వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూచే హక్కు ఎవ్వరికీ లేదు.
ఏమిటో....వింటే షాక్ తింటారు! చూస్తే షాక్ అయిపోతారు...అంటూ...ఇంత దిగజారుడు తనమా!....
డబ్బులు రాలాలనో....ఎక్కువ వ్యూస్ రావలనో....ప్రతిదీ సెన్సేషనలైజ్ చేసేస్తున్నారు. అందులో విషయమేమీ ఉండదు! ఈ ట్రెండ్ మారాలి.
***********
ఇంత ముక్కు సూటిగా మాట్లాడాలంటే....ఇంకెవరు. కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడే....టేకుమళ్ళ జానకి గారు....
ఆ తరువాత శంకరమంచి జానకి గారై....షావుకారు జానకి గా పేరెళ్ళి పోయిన ఉత్తమ శ్రేణి నటీమణి...
వాక్ చాతుర్యం....ఓ ఆభరణంగా మలచుకున్న నారీ మణి.
90 ఏళ్ళకు కూడా మీలో అదే అందం...అంతే యాక్టివ్ గా ఉన్నారు!?...ఆ రహస్యమేమిటి?......అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు....
నిజంగానా! అందంగా ఉన్నానా?...థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్.
ఈ వయసులో ఆరోగ్యంగా ఉంటేనే గొప్ప.
ఇక అందం గా అంటే!......నిజానికి...నేనేం గొప్ప అందగత్తె కాదు. పొట్టిగా...యావరేజ్ గా ఉండేదాన్ని.
కాస్త దేవుడు రంగిచ్చాడు. అందమంటే...చెల్లెలు కృష్ణదే! ఆ హైట్...చక్కటి ఫిగర్...ఆకర్షణీయమైన కళ్ళు....అయినా....నా చెల్లెలు కృష్ణ కుమారంటే....నాకు ప్రాణం.
ఈ జీవన యానంలో....సినీ జగత్తులో....ఎన్నో ఉత్ధాన పతనాలు చూచాను. ఎందరి జీవితాలో స్టడీ చేసే ఛాన్స్....ఆ భగవంతుడు నాకిచ్చాడు. నేను చెప్పదగ్గవి చెప్తాను.
************
టేకుమళ్ళ జానకి గా డిసెంబర్ -12- 1931 లో రాజమండ్రి లో పుట్టి...నాన్న గారు వెంకోజీరావు గారి ఉద్యోగరీత్యా...ఎన్నో ప్రదేశాలు తిరిగి...
అస్సాం లోని గౌహతి యూనివర్సిటీ లో చదువు...ఆ రోజుల్లో కృష్ణ...నేను...రెండు జడలతో...పంజాబీ డ్రస్ వేసుకుని...నడచి పోతున్న సీన్ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుంది.
1947 లోనే శంకరమంచి శ్రీనివాసరావు గారితో పెళ్ళి...వెంటనే బిడ్డ...ఆకాశవాణిలో రేడియో ఆరిస్ట్ గా ఉద్యోగం....
1949 లో షావుకారు మూవీ లో యాక్ట్ చేయడం.... అదే నా ఇంటి పేరుగా ఫిక్స్ అవ్వడం....
నిజానికి బ్రతుకు తెరువు కోసమే....సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది.
నిజానికి నా పాషన్ వంట. రకరకాల వంటలు చేయడమంటే మహా ఇష్టం నాకు.
ఇద్దరు కూతుళ్ళు, ఓ కొడుకు తో....అంతగా కలిసిరాని భర్త తో...చిత్రమైన సినీ రంగంలో....ఈదుతూ....
అన్ని భాషలలో కలిపి షుమారు 400 చిత్రాలలో యాక్ట్ చేయగలిగానంటే....ఆ సృష్టికర్త దయ...అంతా!
సినీ రంగం చాలా అనిశ్చితమైన రంగం...స్థిరత్వం ఏమాత్రం ఉండదంటారు!....అందరూ.
ఆ మాటకొస్తే...మనిషి జీవితానికే గ్యారంటీ లేదు!
ఆ రోజుల్లో...మద్రాస్ లో పది వేల చదరపు అడుగుల్లో...పెద్ద భవంతి కట్టాను.
అందులో షుమారు 300 చిత్రాలకు పైగా సినిమా షూటింగులు జరిగాయి.
మన చేతిలో లేని వాటి గురించి మనం ఏమీ చేయలేం...నిజమే..కనీసం...జీవితాన్ని ఓ క్రమపధ్ధతిలో పెట్టుకొనడం.మన చేతిలో పనే కదా!
************
యు- ట్యూబ్ లో కొన్ని చుచాను....సావిత్రి అంటే నాకు జెలసీ అని...ఇప్పటికీ అది అలాగే ఉందని!...
ఇలాంటివి ఎలా వ్రాసేస్తారో...ఎలా అనేస్తారో....అర్థం కాదు!
ఎప్పుడో...దేవదాసు మూవీ కోసం...నన్ను బుక్ చేసి...కాస్ట్యూములు, ఓ పాట రిహార్సల్...అన్నీ అయి...
రేపు షుటింగ్ అంటే...ఈ రోజు...యువర్ సర్వీసెస్ ఆర్ టర్మినేటెడ్....అని నిర్మాత లెటర్ పంపితే......
అది క్షోభ కలిగించింది.
అదే డి.ఎల్.నారాయణ గారే...మళ్ళీ కన్యాశుల్కం లో బుచ్చెమ్మ పాత్రకు నన్నే అడిగారు.
ఈర్ష్యా- ద్వేషాలకు అతీతం కాదెవ్వరూ! కానీ ఏ ఎమోషన్లయినా తాత్కాలికమే.
నిజానికి సావిత్రి....ఎంతో క్లోజ్ గా చిన్నపిల్ల లాగా నాతో అన్ని విషయాలూ చెప్పేది.
తను మంచి నటీమణి. ఫొటో జెనిక్ ఫేస్. అంతటి ఆకర్షణీయమైన...ఉత్తమ నటి...ఇలా అయిపోయిందే...అని బాధే కానీ...జెలసీ ఎందుకు?
నా పాత్రలు వేరు. ఆవిడ పాత్రలు వేరు.నిజానికి తను ఏపాత్రైన చేయగల సమర్ధురాలు.
కాకపోతే మహానటి అన్నారు. ఓ.కె.
ఆ గౌరవం అలా ఉండనివ్వండి. భూటకపు బయోపిక్ లు....తీసి...సొమ్ము చేసుకోవడం దేనికి?
లెజెండ్స్ కు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అది పబ్లిక్ చేయ వలసిన పనేముంది?
*************
నేనేదో హోటల్ వ్యాపారం చేసి నష్టపోయానన్నారు. అదుగో పులి అంటే...ఇదుగో తోక అంటారు. అసలు జరిగిన దేమిటి?
1970లలో...కాలిఫోర్నియా లో...పిల్లలతో ఉన్నప్పుడు...
అక్కడి తెలుగు & తమిళం వారు ఒత్తిడి తెచ్చారు. ఇంత చక్కగా వంట చేస్తున్నారు. ఇక్కడ ఓ రెస్టరెంట్ ఓపన్ చెయ్యండి అని.
పిల్లలు ఒప్పుకోలేదు. ఇంకా నటిస్తున్నావు. ఇప్పుడెందుకు?... అనేశారు.
నాకు పట్టుదల ఎక్కువ. ఇండియా వచ్చి...ఓ సిక్ యూనిట్...హోటల్ కోకనట్ గ్రూవ్ ను లీజ్ కు 3 సంవత్సరాలు తీసుకున్నా.
స్వయంగా 25 రకాల వంటలు చేసేదాన్ని. చెప్పాగా....డబ్బు కోసం కాదు. పాషన్ అంతే. మెప్పుదల కోసం.
కానీ క్రమేణా...కష్టం నాది....లాభాలు పరులు పంచుకుంటున్నారని...అర్థమై...
బ్రేక్ ఈవన్...తో 3 సంవత్సరాల తరువాత వదిలేశాను. ఆ తరువాత వారు నష్టపోయి...మూసేశారని విన్నాను.
పిల్లలు సెటిల్ అయ్యారు. విదేశాలలో! ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను.
కాకపోతే...అప్పటికీ...ఇప్పటికీ....డిసిప్లైన్ లో తేడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
సీనియర్ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వరు. ఏదో 2 సినిమాలు హిట్ అయితే చాలు కళ్ళు నెత్తి మీదకు...రెమ్యూనరేషన్ కోట్లకు వచ్చేస్తున్నప్పుడు...
మరి ఈ యువతరం అలాగే బిహేవ్ చేస్తారు.
************
నిజానికి తెలుగు కంటే....తమిళ చిత్రసీమే నన్ను ఆదరించినదని చెప్పాలి.
తమిళ చిత్రసీమ అంటున్నాను కదా...సమయమొచ్చింది కనుక చెప్తున్నాను....
జయలలిత కు నాకూ కూడా పడదు....అంటూ యు- ట్యూబ్ లో షాక్ లు ఇస్తున్న వీడియో క్లిప్ లు చూచాను.
ఇందులో కొంతే నిజముంది. ఎందుకంటే తను.....నాకంటే చాలా చిన్నది.
వాళ్ళ అమ్మ సంధ్య గారు ఆడుకునేందుకు అప్పుడప్పుడు జయ ను మా ఇంట్లో వదిలి వెళ్ళేది...షూటింగ్ ఉన్నప్పుడు.
మా పెద్దమ్మాయి & జయ... ఒకే స్కూల్ లో చదువుకున్నారు. మా అమ్మయి చెప్పేది...వాట్ ఎ స్టూడెంట్ మమ్మీ జయ....స్కూల్ టాపర్...సూపర్ ఇంటలిజెంట్ అని!
ఆ తరువాత...జయలలిత స్టార్ కావడం...
.ఓ మూవీలో...అది ఫూల్ ఔర్ పత్తర్ రీమేక్( ఒళి విళక్కు.)...తమిళం లో ఎం.జి.ఆర్ తో తీస్తూ హీరోయిన్ మీనాకుమారి రోల్ నాకిచ్చారు.
సైడ్ హీరోయిన్ రోల్ జయలలిత ది.
కానీ మూవీ పూర్తయ్యాక...ఎం.జి.ఆర్. మీద ఒత్తిడి తెచ్చి... ఆయన పేరు తరువాత...తన పేరు రావాలని...3 వ పేరు హీరోయిన్ అయిన నాది వచ్చేలా చేశారు.
ఇప్పుడున్న శాంతం...నాకప్పుడు లేదు. నిర్మాత..దర్శకులను అడిగితే....జరిగినది చెప్పి...మన్నింపు అడిగారు.
ఆ తరువాత కూడా కాస్త డిఫరెన్షియల్ గా బిహేవ్ చేసేది జయ. నాకు అభిమానం ఎక్కువే. అందుకే....40 సంవత్సరాలు....అసలు మాట్లాడుకోలేదు.
ఆ తరువాత....తనే కొంతమంది నటీమణులతో లంచ్ కు ఆహ్వానించింది....అప్పటికే సి.ఎం. గా ఓ సారి చేసి దిగి పోయింది.
అయినా...ఓ ఇంటర్వ్యూ లో జయ గురించి...ఒక్కటే చెప్పాను.
షి ఈజ్ ఎ స్ట్రాంగ్ లేడి. షి డిడ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ తమిళ్ నాడు. షి విల్ రైజ్ టు ద పవర్ అగెయిన్...అంటూ.
షి వజ్ వెరీ మచ్ మూవ్డ్ బై దట్ వర్డ్స్.
ఓ లెటర్ వ్రాసింది. అది ఇప్పటికీ దాచుకున్నాను. ఎంత చక్కగా చెప్పారమ్మా...మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకున్నాను....
అంటూ అందమైన ఇంగ్లీష్ లో వ్రాసింది. తరువాత సి.ఎం. అయ్యింది కూడా!
************
ఇలా....జీవితం....సాగుతూనే ఉంది. అనుకోకుండా కొన్ని సంఘటనలు కుదిపేస్తాయి.
సౌందర్య మరణం...శ్రీదేవి అంతర్ధానం....అలాంటివే. ఇక చెల్లెలు కృష్ణ కుమారి కూడా వెళ్ళడం తో మరీ ఒంటరినైనట్లుంది!
మహామహులైన నటీనటులతో కలిసి....షుమారు 400 చిత్రాలు చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను.
పిల్లలు సెటిల్ అయ్యారు. నలుగురు గ్రాండ్ చిల్డ్రెన్...ఇద్దరు ముని మనవరాళ్ళు. 88 ఏళ్ళ వయసులో బెంగుళూర్ లో సెటిల్ అయ్యాను.
ఈ వయసులో ఆరోగ్యంగా ఉంటూ ఇంకా నటిస్తున్నానంటే అంతా ఆ సృష్టికర్త దయ.....అంటారావిడ గారు.
************
స్త్రీరత్న,
ప్రైడ్ ఆఫ్ ఇండియా,
వండర్ వుమన్,
కళైమామణి,
నంది అవార్డులు
&
జీవన సాఫల్య పురస్కారాలెన్నో....
బిరుదులెన్నో...వచ్చిన శ్రీమతి షావుకారు జానకి గారికి...
ఒక్క సివిలియన్ అవార్డ్ కూడా రాలేదు!
ఆ బిరుదులమీద వారికి సదభిప్రాయం కూడా లేదు.
రేషన్ కార్డులిచ్చినట్లు....వాళ్ళ వాళ్ళకు పంచుతున్న వాటి మీద మనకెందుకు మోజు.
ఎందరో లబ్ధ ప్రతిష్ఠులకే అవి అందని మ్రాని పండ్లయ్యాయి.
ప్రజా హృదయాలలో చెక్కు చెదరని పేరుంది....షావుకారు జానకి మంచి నటి. కంచు కంఠం జగ్గయ్య గారిలా ...డైలాగ్ డెలివరీ లో అందె వేసిన చెయ్యి అని అందరూ ముక్త కంఠం తో 70 సంవత్సరాలుగా అంటున్నారు.
అది చాలుగా!"

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...