21, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీనివాస రామానుజన్ - ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త - charcoal pencil sketch


 శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 221887ఏప్రిల్ 261920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.

లెక్కoటే లెక్కలేదు వీరికి

వీరి లెక్కల ప్రతిభ 

లెక్కించ లేనిది

లెక్కించగలిగితే లక్కుంటుందనే ఫిలాసఫీ... 


విద్యార్థులను లెక్కల్లో ముంచి

లెక్కకుమించిన ఎత్తుల్లో నిలిపి...

అగణితం!!!

వీరి గణితం అగ్రగణ్యం 


ప్రకృతి భాష గణితం

విశ్వoతో భాషించాలంటే గణితం

విజ్ఞానరూపం గణితం


గణితం...

విశ్వ అనంతతుల్యం 

గణితం సాక్షాత్ పరబ్రహ్మం


 జాతీయ  గణిత దినోత్సవ శుభాకాంక్షలు🙏🙏🙏🌹🌹🌹

వీరి జ్ఞాపకార్ధం భారత దేశంలో 22 డిసెంబర్ తేదీని 'జాతీయ గణిత దినోత్సవం" గా జరుపుకుంటారు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చూసి తెలుసుకోవచ్చు (నా చిత్రానికి మిత్రులు రాముబండారు గారి స్పందన)

(courtesy : 'సమయం')

.https://telugu.samayam.com/latest-news/india-news/why-we-celebrates-srinivasa-ramanujan-birth-anniversary-as-national-mathematics-day/articleshow/79849062.cms


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...