14, డిసెంబర్ 2020, సోమవారం

శైలేంద్ర - ప్రముఖ హిందీ కవి - charcoal pencil sketch



శైలేంద్ర - నా pencil చిత్రం


1940 చివరలో బొంబాయిలోని ఒక ముషైరాలో, ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు  రాజ్ కపూర్ ఒక యువకుడు 'జల్తా హై పంజాబ్' అనే కవితను పఠించడం విన్నాడు. మండుతున్న ఆలోచనలు మరియు ఉద్వేగభరితమైన పఠనంతో చదివిన ఆ కవిత రాజ్ కపూర్ ని విశేషంగా ఆకట్టుకుంది.   పాటను తనకు అమ్మమని ఆ యువ కవిని అభ్యర్థించాడు రాజ్ కపూర్.. కపూర్ నిర్మాణంలో ఉన్న తన చిత్రం ఆగ్ (1948) లో ఉపయోగించడానికి ఆసక్తి చూపించాడు. కానీ యువకుడు తన కవిత్వాన్ని అమ్మదలుచుకోవడానికి అంగీకరించలేదు. అప్పుడు రాజ్ కపూర్ యువకవి కి ప్రతిపాదన చేసాడు.   తన మనసు మార్చుకుంటే ఎప్పుడైనా వచ్చి తనను కలుసుకోవచ్చని ఆ యువ కవికి సలహా ఇచ్చాడు రాజ్ కపూర్. ఆ యువకుడే హిందీ చలనచిత్ర రంగంలో తన పాటల రచనలతో చరిత్ర సృషించిన కవి ‘శైలేంద్ర’. 

తరువాత, ఆసక్తికరమైన సంఘటనలో, రైల్వే వర్క్ షాప్ లో welder గా పనిచేసిన శైలేంద్ర నిర్మాత, దర్శకుడు అయిన రాజ్ కపూర్ ని కలవాల్సిన పరిస్థితి వచ్చింద్... శైలేంద్ర భార్య గర్భవతి , ఆమె ప్రసవానికి డబ్బు అవసరం. కపూర్ చెప్పిన మాటలు గుర్తుకురావడంతో యువకుడు, రాజ్ కపూర్ ని కలుసుకుని అయిదు వందల రూపాయలు ఋణంగా కోరాడు. రాజ్ కపూర్ అప్పుగా కాకుండా తన సహాయంగా స్వీకరించమన్నాడు. అందుకు శైలేంద్ర విముఖతని తెలియబరచి ప్రతిఫలంగా తనను ఇంకేదైనా పధ్ధతిలో ఋణవిముక్తుణ్ణి చేయమని కోరాడు. అప్పుడు రాజ్ కపూర్ తను నిర్మిస్తున్న 'బర్సాత్' చిత్రానికి రెండు పాటలు రాయమని కోరాడు. శైలేంద్ర అంగీకరించి రెండు పాటలు రాశాడు. అవి 'పత్లి కమర్ హై' 'బర్సాత్ మే హమ్ సే మిలే తుమ్' పాటలు' .. రెండు పాటలూ చార్ట్ బస్టర్ గా నిలదొక్కుకోవడమే కాకుండా చిత్ర విజయానికి దోహదపడ్డాయిఇతని అసలు పేరు శంకర్ దాస్ కేసరి లాల్. కలం పేర్ 'శైలేంద్ర'. 1923 ఆగస్టు 30న బీహర్ లో జన్మించారు.


ఆ తర్వాత జంట సంగీత దర్శకులు శంకర్-జౖకిషన్, రాజ్ కపూర్ చిత్రాలకి ఎన్నో పాటలు రాశారు. ఆ పాటలన్నీ విజయవంతమై శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శైలేంద్ర ఇతర సంగీత దర్శకులకు కూడా ఎన్నో పాటలు రాశాడు.


తర్వాత శైలేంద్ర 'తీస్రీ కసమ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఇది ఎన్నో పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా జనాదరణ పొందలేక, విజయం సాధించలేకపోగా శైలేంద్ర కి నష్తాలను మిగిల్చింది. మనస్తాపం చెందిన శైలేంద్ర మద్యానికి బానిస అయ్యాడు.1966 డెసెంబర్ 14వ  తేదీన మృతి చెందాడు. 


శైలేంద్ర మూడు సార్లు ఉత్తమ గేయ రచయితగా ఫిలింఫేర్ పురస్కారం గెలుచుకున్నాడు.


శైలేంద్ర రచించిన కొన్ని ప్రజాదరణ పొందిన పాటలు


 

 


కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...