18, డిసెంబర్ 2020, శుక్రవారం

ప్రజాపాటల త్యాగయ్య 'గరిమెళ్ళ సత్యనారాయణ'

(charcoal pencil sketch)

'ప్రజాపాటల త్యాగయ్య' గరిమెళ్ళ సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

"మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.

N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు.

"మా కొద్దీ తెల్లదొరతనము  దేవ మా  ప్రాణాలపై పొంచి మానాలు హరియించె     ||మాకొద్దీ||
పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి  ఉప్పు ముట్టుకుంటె దోషమండి
నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి   ||మాకొద్దీ||
చూడి యావుల కడుపు వేడివేడి మాంసం-వాడికి బహు ఇష్టమంట మాదు పాడి పశువుల కోస్తాడంట, మా మతము పాడుచేస్తాడంట మా చూడియావుల మంద సురిగి ఇంటికిరాదు.   ||మాకొద్దీ||"

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో. 'తెలిగుబిడ్డ" సౌజన్యంతో



 

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...