24, డిసెంబర్ 2020, గురువారం

అమర గాయకుడు 'మహమ్మద్ రఫీ"

 

మహమ్మద్ రఫీ (నా pencil చిత్రాలు). ఈ రోజు రఫీ గారి జయంతి సందర్భంగా ఆ మహా గాయకునికి నా చిత్ర నివాళి. ఆయన మధుర గీతాలు ఇంకా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఆనాటి మేటి నటులైన దిలీప్ కుమార్, దేవానంద్, షమ్మీకపూర్, శశికపూర్, ఇంకా ఎందరో నటులకు వారి body language కి తగినట్లుగా గానం చేసి ఆ నటులే స్వయంగా పాడుతున్నారా అనిపించే విధంగా పాడి శెభాష్ అనిపించుకున్నారు. ఈ అమరగాయకుని జయంతి సందర్భంగా ఈ రోజు నేను Times of India దినపత్రికలో సేకరించిన వివరాలు టూకీగా :



మహమ్మద్ రఫీ యొక్క చిన్న కుమారుడు షాహిద్ రఫీ ముంబైలో భారతదేశపు సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించిన మహా గాయకుడు మహమ్మద్ రఫీ పుట్టినరోజును కుటుంబంతో జరుపుకున్నారు. కానీ ప్రస్తుతం అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతని కుమారుడు, రఫీ సాబ్ మనవడు ఫుజైల్ రఫీ తన తండ్రితో ఈ పుట్టినరోజును జరుపుకోలేకపోయినా ఓ ఆశ్చర్యకర వార్తతో తన తండ్రిని ఆశ్చర్యపరిచాడు. "ఈ సంవత్సరం నేను నా తండ్రితో కలిసి నా తాత పుట్టినరోజుని జరుపుకోలేకపోతున్నాను. కాని నేను నా తండ్రిని ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. మహమ్మద్ రఫీ జ్ఞాపకార్ధం నేను ఓ పనిని ప్రారంభించాను మరియు ఆ ప్రక్రియలో ఉన్నాను. నా తాత పేరిట ఓ "ఆన్‌లైన్ మ్యూజికల్ ఇనిస్టిట్యూట్" ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రఫీ సాహబ్‌తో కనెక్ట్ అవ్వడానికి, సంగీత పరిశ్రమలోని ప్రఖ్యాత వ్యక్తుల నుండి వివిధ రకాలైన సంగీతాన్ని నేర్చుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతం మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. నేను నా తాత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను" అన్నాడు ఫుజైల్ రఫీ.



రఫీ సాబ్ స్వర్గస్థులై నాలుగు దశాబ్దాలు గడిచినా సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇప్పుడు. మహమ్మద్ రఫీ మనవడు తీసుకున్న ఈ నిర్ణయం సంగీత ప్రియులకు. మరియు గాయకులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిద్దాం.




మహమ్మద్ రఫీలా పాటలుపాడే అదృష్టం లేకపోయినా కనీసం నా pencil ద్వారా వారి చిత్రాలు చిత్రీకరించుకునే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉంది. అంతకు మించి ఈ మహా గాయకునికి నేనేమి సమ్ర్పించుకోగలను.




కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...