కస్తూరి శివరావు !*1913లో మార్చి 6న కాకినాడలో జన్మించిన శివరావు నాటకాల్లోహాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు.హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్ రికార్డులుగా ఇచ్చాడు.వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు.చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషంజనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు.తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా,స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెలిసాడు.బాలరాజు (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి,జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు.ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసంపడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగాసినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది."హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగావెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు.రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది.క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమనిఅడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీఅనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగాకూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు.దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది.తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి ‘బ్యూక్’ కారు వుండేది.అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్ కారునే వాడేవారు. మద్రాసు పాండీబజార్లో ఆ బ్యూక్ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంటపరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడాతగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ.తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనేతిరుగుతున్నాను.ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యంగుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాలకంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు.ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగినశివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు."తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే !అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతోవున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడుఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించనిపరిస్థితిలో శివరావు గారి మీద అభిమానముతో ఎన్.టి.రామారావుగారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమాషూటింగులల్లో కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదుశివరావు చరమదశ మాత్రం దయనీయంగా గడిచింది.అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు.చివరిసారిగా 1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటలతరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు.ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - నాలుగు కార్లుమెంటైన్ చేసిన శివరావు చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసుచేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడోకారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావుమృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతనిమరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్ లేదనో మొత్తానికిఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడువేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు -నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంపచేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండాదాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది.
6, ఏప్రిల్ 2021, మంగళవారం
కస్తూరి శివరావు - తెలుగు సినిమా తొలి హాస్య నటుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
The power of 'Will' Usage - English grammar - illustration
When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...


కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి