20, ఏప్రిల్ 2021, మంగళవారం

సుసర్ల దక్షిణామూర్తి - సంగీత దర్శకుడు


సుసర్ల దక్షిణామూర్తి (1921-2012)


(Pencil sketch by Ponnada Murty, that is me)

సుసర్ల దక్షిణామూర్తి అనగానే మనకు సినీ సంగీత దర్శకుడు, ‘నర్తనశాలసినిమా, లతా మంగేష్కర్‌ ‘నిదురపోరా తమ్ముడాపాట ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులకు మాత్రం మంగళంపల్లి బాలమురళికృష్ణ, ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి గురువు - సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి గుర్తొస్తారు.


నిజమే గుర్తుకి గుర్తుకి, మధ్య గుర్తుంచుకోదగ్గ బంధుత్వమే ఉంది. త్యాగరాజ శిష్య పరంపరకి చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి - సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తికి స్వయానా తాత. సుస్వర సంపదను వారసత్వంగా పుణికి పుచ్చుకోవడం వల్లనే వయొలిన్తో పదమూడో ఏట రాజస్థానాల్లో తన ప్రతిభను ప్రదర్శించి పదహారవ సంవత్సరంలోనే గజారోహణ సత్కారాన్ని అందుకున్నారు కూడా.


తరువాత ఆల్ఇండియా రేడియోలో గ్రేడ్ఆర్టిస్ట్గా గుర్తింపు పొంది చాలా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సౌతిండియన్మ్యూజిక్విభాగానికి స్టేషన్డైరక్టురుగా ఆహ్వానాన్ని అందుకున్నారు. ఆహ్వానాన్ని స్వీకరించకుండా మద్రాసు వైపు ఆయన సాగించిన సినీ సంగీత ప్రస్థానంలో శ్రోతలకు మిగిల్చిన కొన్ని మధురైమైన మలుపులు, మజిలీలు గురించి తలపుల తలుపులు తెరిచి తల్చుకుందాం - ఆయనకు నివాళిగా.


* కొన్ని కొన్ని జిలుగులు తళుక్కుమని మెరిసి వెళ్లిపోతుంటాయి. అలాంటివి పాటలో ఎక్కడో దగ్గిర వేసి పాటకు కొత్తందాలు తీసుకురావడంలో సుసర్ల వారి శైలి విభన్నంగా ఉంటుంది. ఉదాహరణకిబండరాముడులోఒక సారి ఆగుమా చందమామఅంటూ అద్భుతమైన మలుపు ఊహించని విధంగా తిరుగుతుంది. విన్నవాళ్లే కాదు - ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా సరే మలుపుని ఎంజాయ్చెయ్యకుండా పాడడం జరగదు. అదీ సుసర్లంటే. అలాగేఎవ్వరి కోసం మందహాసం’ (నర్తనశాల) పాట చివర్న పల్లవి రిపీట్కాగానే వచ్చే వయొలెన్బిట్‌. ఇది మొత్తం పాటలో ఒకేసారి వస్తుంది. అయినా పాట ప్రస్తావన వచ్చినప్పుడల్లా బిట్ని హమ్చెయ్యని సంగీత ప్రియులుండరు. ‘నర్తనశాలలోనేసఖియా వివరించవేపాటలో.. చిట్ట చివరకి ల్యాండింగ్గా వచ్చే ఆలాపన.. పాడే వారి నోట ఆలాపన రాగానే వినే వారి ముఖంలో వెలుగుతో కనిపించే ఎక్స్ప్రెస్ని కెమెరాతో క్యాచ్చేసి చూపించాలే తప్ప ఎంత వర్ణించినా అది అనుభవానికి నీడలా ఉంటుందే తప్ప ప్రతిబింబంలా ఉండలేదు.

 

* జగపతి వారి తొలి చిత్రంఅన్నపూర్ణలో హీరో జగ్గయ్యకి పీబీ శ్రీనివాస్చేత (‘మనసేమిటో తెలిసిందిలే...’ అనే పాట), హాస్య పాత్రధారి రేలంగికి ఘంటసాల చేత పాడించడం. జగ్గయ్యకి పీబీ శ్రీనివాస్బావుంటుంది. కానీ రేలంగికి ఘంటసాల చేత పాడించాల్సిన అవసరం లేదు. అప్పటికే ఎస్టాబ్లెష్అయిపోయిన మాధవపెద్ది ఉన్నారు. పైగా గతంలో తనే రేలంగికి - ‘సంసారంలోసొగసైన క్రాఫ్పోయే నగమోము చిన్న బోయే..’ అనే పాటనీ, ‘ఇలవేల్పులోసాంబ్రాణి ధూపమేసి పట్టనాలాంటి పాటనీ పాడి హిట్చేసిన చరిత్ర ఉంది సుసర్లకి. అయినా ఘంటసాల చేత (‘వగలాడి వయ్యారం భలే జోరు..’ అనే పాట) పాడించడం.. అదీ మహా లబ్జుగా! ఇది సాహసం కాదు..సామర్థ్యం.


* ఇవి కాక తెలుగువారికి సంప్రదాయానికి సుసర్లవారు తన వంతుగా సమర్పించిన గీతాలు రెండున్నాయి. ఒకటిసంసారంలోఅమ్మా శ్రీ తులసీ దయారాశివమ్మాపాటైతే, ఇంకొకటినర్తనశాలలోజయగణనాయక విఘ్న వినాయక’. మొదటిది లేకుండా తులసి పూజ, రెండవది లేకుండా నృత్యపూజ జరగడం తెలుగింట అరుదు.

* సుసర్లవారి శరీరం ఎంత ధృడమైనదో ఆయన శారీరం (గాత్రం) అంతకంటే ధృడమైనది. అది ఎంత ఎత్తుకి వెళ్లగలదో తెలుసుకోవాలంటేసంతానంలో ఘంటసాల చేత పాడించిన రెండు పాటల్ని గమనిస్తే చాలు. మొదటిదికనుమూసిన కనిపించే నిజమిదేఅనే విషాద గీతం. రెండవది అందరికీ తెలిసినదేవీ శ్రీదేవిఅనే ప్రేమ గీతం. షణ్ముఖప్రియ రాగానికి ఉదాహరణగా సినీ గీతాన్ని చెప్పమంటే ఎవరైనా సరే మొదట చెప్పే పాట - దేవీ శ్రీదేవి. పాటను రేంజ్లో పాడగలగడం ఘంటసాల అభిమానులకు స్టేటస్సింబల్‌. అలా రేంజ్లోకి వెళ్లగల గాత్రాలుంటే అంతరేంజ్లో పాటల్ని స్వరపరచడమేకాక పాడి - పాడించడంలో దిట్ట సుసర్ల. అందుకు మరో ఉదాహరణసంతానంఅనగానే గుర్తొచ్చేపాట తెలుగువారు గర్వంగా చెప్పుకునే పాట సుసర్లవారి కీర్తి కిరీటంలో కలిగితురాయిగా నిలిచిపోయిన పాటనిదురపోరా తమ్ముడా’. ఈపాటలోజాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారేదగ్గర లతా వాయిస్ని ఎంత రేంజ్కి వేళ్లేటట్టు చేశారో తిరిగి అదే పాట ఘంటసాల వెర్షన్తో రిపీట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ని కూడా అదే రేంజ్లో వాడుకున్నారాయన. ( పాట పాడి ఇంటికెళ్లాక - ‘లతా మంగేష్కర్వచ్చిందని సూట్లో వచ్చాడు దక్షిణామూర్తిఅని చెప్పారట ఘంటసాల తన భార్య సావిత్రమ్మతో).


* ఇలా రేంజ్ఉన్న పాటలతో పాటు మాధుర్యంతో తొణికిసలాడే మృదువైన గీతాలను అభిమానించే వారి కోసం కూడా తక్కువేం చెయ్యలేదు సుసర్ల. అందుకు మొదట మంచి ఉదాహరణచల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో’ (సంతానం) పాటనే చెప్పుకోవాలి. ప్రభుదేవా నటించినప్రేమికుడుసినిమాలో అతనితో మందు తాగిస్తూఎవర్ని ప్రేమించావు?’ అని అతని తండ్రి (ఎస్పీబాలు) అడిగే సీన్గుర్తుందా? అక్కడ సరదాగా బాలూ హమ్చేసిన పాట ఇదే. నిజానికి అది డబ్బింగ్సినిమా కాబట్టి పాట హమ్చేసినా చెల్లిపోతుంది. కానీ ఈపాటనే బాలూ ఎన్నుకోవడానికి గల కారణం పాçపై బాలూకున్న మక్కువతోపాటు ఎంపికను ప్రేక్షకుల ఎంజాయ్చేస్తారనే నమ్మకం కూడా. అలానే జరిగింది. అలా క్రెడిట్లో కొంత పరోక్షంగా సుసర్ల వారికి వెళ్తుంది.

 

* ‘సంతానంసినిమాలోనిసంతోషమేలా సంతోషమేలాపాట గురించీ చెప్పాలి. నిజానికి పాట ట్యూన్సుసర్లవారిది కాదు. శాంతారాం తీసినసుభా కా తారాసినిమాలోనిగయా అందేరా హువా ఉజాలాఅనే గీతం తాలూకు బాణీ అది. తెలుగు పాటను ఎస్పీ కోదండపాణి (జమునారాణితో కలిసి) ఆలపించారు. గాయకుడిగా ఎస్పీ కోదండపాణి అనగానేఇదిగో దేవుడు చేసిన బొమ్మ’ (పండంటి కాపురం) పాటనే ఆయన మొదటి పాటనుకుంటారు. ఆయనతో సుసర్ల వారెప్పుడో పాడించారని చాలా మందికి తెలియదు. అలాగే ఎమ్మెల్వసంతకుమారితోవచ్చిన కోడలు నచ్చిందిలో పాడించిన ఘనత కూడా ఈయన అకౌంట్లో ఉంది. కోదండపాణితో పాడించడానికి కారణం సుసర్లవారి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడమే. ఒక్క కోదండపాణే కాదు. ఎమ్మెస్విశ్వనాథం, ..రాజ్వీరంతా సుసర్ల వద్ద పని చేసిన వారే.


* ఎమ్మెల్వసంతకుమారితో పాడించినట్టే ఒరియా గాయకుడు రఘునాథ పాణిగ్రహితోచల్లని రాజా చందమామా’ (‘ఇలవేల్పు’) పాటని పాడించడం, పాట అటు పాణిగ్రహి కెరీర్కి, ఇటు తెలుగు సినీ సంగీత చరిత్రకే ఒక ల్యాండ్మార్క్గా మిగిలిపోవడం సుసర్లవారి క్రెడిట్స్లో చేరదగ్గవి.

* ఇక్కడ మరో రెండు విషయాలు చెప్పాలి. అక్కినేనికి ఘంటసాల అలవాటు పడుతున్న రోజుల్లో రఘునాథ పాణిగ్రహిచల్లనిరాజా చందమామాపాడించడం ఒక్కటైతే, ఘంటసాల బాగా అలవాటయిపోయిన తరువాత ఎన్టీఆర్కిబండరాముడులో పిఠాపురం నాగేశ్వరరావుతో (రకరకాల పూలు.. అనే పాట) పాడించడం, అదే సినిమాలో నాగయ్యకి ఘంటసాలతో (రాధా మోహన రాస విహారీ..అనే పాట) పాడించడం.. వీటినేమంటారు? ఇదివరకు అనుకున్నట్టు సాహసమా.. సామర్థ్యమా..లేక ప్రయోగమా? అలా అయితే ఒకే సినిమాలో (నర్తనశాల) ఎన్టీఆర్కి (బృహన్నలగా ఉన్నప్పుడు) అటు ఘంటసాలతో (జయగణ నాయక), ఇటు బాలమురళితో (సలలిత రాగ సుధా రససారం) పాడించడాన్ని ఏం అంటారు.



* ఇకనర్తనశాలవిషయానికొస్తే పాటని హిట్కాని పాటగా తీసెయ్యగలం? ‘నరవరా కురువరా’, ‘జననీ శివ కామినీ’, ‘జయగణ నాయక’, ‘సలలిత రాగసుధరస’, ‘ఎవ్వరి కోసం మందహాసం’, ‘సఖియా వివరించవే’, ‘దరికి రాబోకు రాజాఇలా పాటని మర్చిపోగలం..మరి పద్యాలు..ఏనుగు నెక్కి పెక్కేనుంగలిరుగడరా.. కాంచన మమ వేదికా.. వీటికి అమృత ధారలద్దినది సుసర్ల సుస్వరాలే కదూ!?

 

*  సందర్భంగా మరో సంగతి చెప్పుకోవాలి. ‘నర్తనశాలవచ్చిన పదహారేళ్ల తరువాత అదే కథాంశంతోశ్రీమద్విరాట్పర్వంవచ్చింది. దీనికీ సుసర్లే సంగీత దర్శకుడు. సినిమాతో పోలిస్తే మిగిలిన పాటలకి లేని ఇబ్బంది పాటకి వచ్చి పడింది. ‘నర్తనశాలలో సైరంధ్రి - కీచకుణ్ణి ఆహ్వానిస్తూదరికి రాబోకు రాబోకు రాజాఅంటూ పాడుతుంది. అది సోలో. ఇక్కడమద్విరాట్పర్వంవిషయానికొచ్చేసరికి (ఎన్టీఆర్కీచకుడు కనుక) కీచకుడు కూడా గొంతు కలుపుతాడు. పైగా నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్అభినయించినచిత్రం హాయ్భళారే విచిత్రంపాట (‘దాన వీర శూర కర్ణ’) అప్పటికే హిట్టు. దానికి సుసర్ల తమషా చేశారు. ‘మనసాయెనా మతిపోయెనాఅని సైరంధ్రి అంటేఎప్పుడు మనసౌవుతుందో, ఎప్పుడు మతిపోతుందో, అప్పుడే కథ మొదలవుతుందిఅని ఎత్తుకుంటాడు కీచకుడు. సరిగ్గా కీచకుడి లైన్స్రాగానే వెనుక ఇన్స్ట్రుమెంట్స్అన్నీ వెస్ట్రన్స్టయిల్లో ఫాలో అవుతాయి. జనం కొత్తదనం ఫీలయ్యారు. ఆనందించారు.


* ఇలా చెప్పుకొంటూపోతే సుసర్ల వారి పాటల గురించి ప్రత్యేకంగా పుస్తకమే వెయ్యొచ్చు. ‘నారద నారదిసినిమాతో స్వతంత్య్ర సినీ సంగీత దర్శకుడిగా మొదలైన ఆయన జీవనం ఎన్నో మలుపులు తిరిగింది. ‘లక్ష్మమ్మకథ’, ‘స్త్రీ సాహసం’, ‘పరమానందయ్య శిష్యులుచిత్రాల్లో అక్కినేనికి ప్లే బ్యాక్పాడడం, ‘సర్వాధికారిచిత్రంలో ఎన్టీఆర్కి డబ్బింగ్చెప్పడంలాంటివి కూడా వాటిలో కొన్ని. సంగీత దర్శకుడిగా వర్క్తగ్గాక ఖాళీగా కూర్చోలేదు. చక్రవర్తి ఆర్కెస్ట్రాలో వయొలిన్వాయించే వారు. పనిని ఆయన చిన్నతనంగా ఫీలవ్వలేదు. అది కూడా సంగీతారాధనే అనుకునేవారు. చక్రవర్తి కూడా ఈయన్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు.

* ఓసారి రికార్డింగ్థియేటర్లోకి వెళ్తుతున్నారు సుసర్ల. అంతకు కొన్నేళ్ల క్రితమే చక్రవర్తి ఆర్కెస్ట్రాలో చేరిన కుర్రాడు కాళ్లు బార్లా జాపుకుని అడ్డంగా కూచున్నాడు. అతన్ని దాటుకుని వెళ్లడం కుదరక తప్పుకుని వేరే రూట్లో థియేటర్కి వెళ్లారాయన. అదంతా గమనించిన చక్రవర్తికి కోపం నసాళానికి అంటింది. స్పీడుగా వెళ్లి కుర్రాడు కూర్చున్న కుర్చీని తాపు తన్నారు. ‘‘ఆయన ఎవరనుకుంటున్నావురా? ఆయనకున్న విద్వత్తు మనకి రావాలంటే జన్మలెత్తాలి మనం’’ అన్నారు గట్టిగా అరుస్తూ. సంఘటన ఒక్కటి చాలు సుసర్ల పట్ల విషయం ఉన్న సీనియర్సంగీత దర్శకులు ఎంత గౌరవాన్ని కనపర్చేవారో చెప్పడానికి.

* కాలక్రమేణా షుగర్వ్యాధి ముదరడం వల్ల ఆయనకు చూపుపోయింది. వయోభారతంతో వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. చివరగా ఎఫ్‌.ఎమ్‌.రేడియో వాళ్లు ఇచ్చిన లైఫ్టైమ్ఎఛీవ్మెంట్అవార్డే సుసర్ల అందుకున్న ఆఖరి అవార్డు. వ్యాధిగ్రస్తుడైపోలేదాయన. పోయే ముందు కూడానన్ను హాస్పిటల్కి తీసుకెళ్లవద్దుఅని స్పష్టంగా చెప్పి మరీపోయారు.

* ఏదీ ఏమైనా చంద్రుడున్నంత కాలం తెలుగువారికిచల్లని రాజా చందమామాపాట ఉంటుంది. కంటికి నిద్ర సుఖం తెలిసున్నంతవరకూనిదురపోరా తమ్ముడాగుర్తుంటుంది. మంచి సంగీతం మీద గౌరవం ఉన్నంతవరకూసలలిత రాగ సుధా రస సారంఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అదే సుస్వర వాహిని. సుసర్ల వాహిని.

(వ్యాసం సౌజన్యం : Musicologist Raja)


 

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...