Chandra, Artist - My pencil sketch
చంద్ర కుంచె పేరుతో ప్రఖ్యాతి గాంచిన చిత్రకారుడు, శిల్పి, కార్టూనిస్టు పూర్తిపేరు మైదం చంద్రశేఖర్. వీరు తెలంగాణలో వరంగల్ కి చెందిన వారు. Fine arts లో పట్టబధ్రుడు. వీరు కొన్ని వేల కధలకి చిత్రాలు వేశారు. ఎన్నో పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలు వేశారు. వీరు మంచి వ్యంగ్య చిత్రకారులు కూడా. వీరి మొదటి కార్టూన్ 1959 లో ఆంధ్రపత్రికలో ప్రచ్రించబడింది. వీరు కొన్ని సినిమాలకు, documentaries కి కళాదర్శకుడుగా పనిచేసారు. దర్శకత్వం కూడా వహించారు.
1946, ఆగస్టు 25 వ తేదీన వరంగల్ జిల్లా, నర్సింహుల పేట మండలం, పెదముప్పారం గ్రామంలొ జనించిన వీరు 2021 ఏప్రిల్ 29 న హైదరాబాద్ లో మృతి చెందారు.
చంద్ర గారు చిత్రించిన ఓ అద్భుత చిత్రం. శ్రుంగార చిత్రాలు వెయ్యడంలో వీరిది అందెవేసిన చెయ్యి.
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి