20, సెప్టెంబర్ 2021, సోమవారం

గణపతి నవరాత్రులు - వాణీ గణపతి / లక్ష్మీ గణపతి / శక్తి గణపతి


గణపతి నవరాత్రులు సందర్భంగా నా చిత్రం. పద్యాలు/భావం సౌజన్యం డా. Umadevi Prasadarao Jandhyala గారు
~~~~~~~~~~
వాణీ గణపతి/ లక్ష్మీ గణపతి/ శక్తి గణపతి
~~~~~~~~~~~~
చం॥పంచపాది
చదువుల తల్లిశారదకు సంపదలిచ్చెడి మాత లక్ష్మికిన్
సదమలయైన గౌరికిని చక్కగ నర్చన జేయభాద్రమున్
కొదువను మాట యుండదిక కోరిన వన్నియు కూడు నింటిలో
ముదముగనమ్మలందరును మోదక హస్తుని ముద్దులాడుచున్
మృదువుగనిత్తురన్నిటిని మీకిక చింతలులేవు లేవనన్!
భావము-
————
భాద్రపద చతుర్ధి నాడు వినాయకుని పూజతో బాటు చదువులతల్లి శారదను, సంపదలిచ్చే జనని లక్ష్మీదేవిని, శక్తినిచ్చే వినాయకుని కన్నతల్లి గౌరిని పూజిస్తే ముద్దులొలికే బాలుని ముద్దాడే ముగ్గురమ్మలూ మనకు చదువు, సంపద, శక్తి ప్రసాదిస్తారు.
2)ఉ. మా॥
వాదము లందుగెల్వగను వాక్కున నిల్చును వాణి రూపుడై
పేదల బాధతీర్చగను పెన్నిధి తానగు లక్ష్మి రూపుడై
వేదిని యష్టపత్రముల వేయగ గన్పడు శక్తి రూపుడై!
భేదము లేకనిచ్చునివి పెంపుగ నీశ్వర బుత్రుడీవిధిన్ !
*భావము
~~~~~~
విద్య సంబంధమైన చర్చలలో వాణీ గణపతిగా వాక్కున నిలుచును.
పేదలు పూజిస్తే లక్ష్మీగణపతిగా సంపదలిచ్చి బాధలు పోగొట్టగలడు.
పీఠము మీద అష్టదళ పద్మము వేస్తే
గౌరీ పుత్రుడు గనక శక్తి గణపతై శక్తి నిస్తాడు।
ఈ విధంగా మనకోరికలన్నీ భేదము చూపక తీర్చే దైవము గణపతి .

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...