17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

అనిల్ బిశ్వాస్ - చలనచిత్ర సంగీత రధసారధి


సంగీత దర్శకులకే సంగీత దర్శకుడు, ఎందరో గాయకులకు మార్గదర్శి అనిల్ బిశ్వాస్. (1914-2003) (Pencil sketch)

ముకేష్, తలత్ మహమ్మద్ వంటి అగ్రశ్రేణి గాయకులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత వీరిది. నటుడు కావాలని అనుకున్న తలత్ మహమ్మద్ కి "నువ్వు నటుడుగా కంటే గాయకుడుగానే రాణిస్తావని" చెప్పి తన సంగీత దర్శకత్వంలో తొలి అవకాశం ఇచ్చాడు. తర్వాత రోజుల్లో తలత్ "King of Gajals" గా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించాడో జగద్విదితం. "కె. ఎల్. సైగల్ ని అనుసరించవద్దని నీ style లోనే నువ్వు పాడమని" ముకేష్ కి సలహా ఇచ్చింది కూడా ఈయనే.
లతా మంగేష్కర్ వంటి గాయనీ మణులకు పాట పాడుతున్నప్పుడు పాటించ వలసిన breathing technics నేర్పింది కూడా ఈయనే .

అనిల్ బిశ్వాస్, గులాం హైదర్ మరియు ఖేమ్‌చంద్ ప్రకాష్ లతా మంగేష్కర్ చిత్ర పరిశ్రమలో ఆమె భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె "సన్నని" వాయిస్ మరియు ఆమె సరిగ్గా లేని  ఉర్దూ ఉచ్చారణ పై పలు విమర్శలు వచ్చాయట. కానీ ఈ ముగ్గురి సహకారంతో  తన గానంపై ప్రత్యేక శ్రధ్ధ పెట్టి, విశేషమైన కృషి చేసి కొన్ని  దశాబ్దాలుపాటు హిందీ చిత్రాలలో తిరుగులేని  ప్రముఖ మహిళా గాయనిగా ఎదిగింది. లతా మంగేష్కర్ "ఇన్ హర్ ఓన్ వాయిస్" (నస్రీన్ మున్నీ కబీర్) పుస్తకంలో అనిల్ బిశ్వాస్ నుండి ఆమె నేర్చుకున్న విషయాలు కొన్ని ప్రస్తావించారు.. 
 
అనిల్ బిశ్వాస్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ "లాడ్లీ" చిత్రంలో "tumhare bulane ko jee chaahta hai' పాడిన ఈ క్రిందపాట వింటుంటే అప్పటి ఆమె గొంతు ఎలాగుండేదో తెలుస్తుంది.  
https://www.youtube.com/watch?v=YFHIrQF996s  
1943 సంవత్సరంలో విడుదలైన "కిస్మత్" భారతీయ చలనచిత్ర చరిత్రలోనే first super block buster గా పేరొందింది.(ఈ చిత్రాన్ని "భలేరాముడు" గా తర్వాత తెలుగులో "ప్రేమపాశం" అని తమిళ్ లో నిర్మించారు) 1975 లో విడుదలైన 'షోలే' చిత్రం వరకూ దీనిని అధిగమించిన hit చిత్రం మరొకటి రాలేదు. 'కిస్మత్' చిత్రానికి సంగీతం సమకూర్చినది అనిల్ బిశ్వాస్.
అనిల్ బిశ్వాస్ ఒక్క సంగీత దర్శకుడే కాదు, విద్యార్ధి దశలోనే స్వాతంత్ర్య సమర యుధ్ధంలో పాల్గొని జైల్ శిక్ష కూడా అనుభవించాడు.
నౌషాద్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులు కూడా వీరు కనిపించినప్పుడు వీరికి పాదాభివందనం చేసేవారు.
ఈ మహానుభావునికి నా చిత్ర నివాళి.

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...