2, సెప్టెంబర్ 2021, గురువారం

అరవై లో ఇరవై

అరవై లో ఇరవై

పచ్చగా మెరిసే పండుటాకులమే గాని
చప్పుడు చేసే ఎండుటాకులం కాదు
కలలు పండినా పండకపోయినా
మేము తలలు పండిన తిమ్మరుసులం

కొరవడింది కంటి చూపు గాని
మందగించలేదు ముందు చూపు
అలసిపోయింది దేహమే గాని
మనసుకు లేనే లేదు సందేహం

ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా
ఈ భూమికి కాబోము భారం
అరవై లో ఇరవై కాకున్నా
అందని ద్రాక్ష కై అర్రులు చాచం

కుందేళ్ళమై పరుగులు తీయకున్నా
తాబేళ్లమై గెలుపు బాట చూపగలం
చెడుగుడు కూతల సత్తా లేకున్నా
చదరంగపు ఎత్తులు నేర్పగలం

సమయం ఎంతో మాకు లేకున్నా
సమయమంతా మీకు సమర్పిస్తాం
అనుకోకుంటే అధిక ప్రసంగం
అనుభవ సారం పంచుకుంటాం

వాడిపోయే పూవులమైనా
సౌరభాలు వెదజల్లుతాం
రాలిపోయే తారలమైనా
కాంతి పుంజాలు వెదజల్లుతాం (ఎవరు రాసారో తెలియదు. Whatsapp నుండి సేకరణ. నాకు నచ్చింది. బొమ్మ నాది. రాసిన వారికి నా కృతజ్ఞతలు)
 

1 కామెంట్‌:

Rao S Lakkaraju చెప్పారు...

గేయానికి తగ్గ బొమ్మ.

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...