9, ఫిబ్రవరి 2016, మంగళవారం

చెలి మోము - పెన్సిల్ చిత్రం

చెలి మోము
. .... ........
.
సీ॥చంద్ర బింబము బోలు।చెలియమోము నలరు
చూడ కుంతలములు।నీడ ఝరులు 
నుదుట వజ్రము రవి।నూత్నశోభల గూర్చు
కనురెప్ప కాటుక।కాంతు లీగ
మత్తైన చూపుల।పుత్తడి నయనాలు
పెదవింటనతి తీపి।పదము లొలుకు
రింగులా ముంగురుల్।రంగైన నెలవంక
చెంగావి పూబంతి।చెలియ నగవు
ఆ॥చెంప కెంపు వంపు।నింపైన జవరాలి
ముఖము జూడ నిలన।ముచ్చ టేయు
నర్సపురని వాస।నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష।వినుర దీక్ష
.
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం
. 09/ 02/ 2016
శ్రీ పొన్నడ మూర్తి గారు గీసిన అద్భుతమైన చిత్రానికి
నా భక్తిగా..ఓ చిన్న సీస పద్యం .../\

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చెలి మోము చూడ మదిలో జజ్జినకరి పుట్టె.
తవిక చదివిచూడ వికారమ్ము కలిగె.
పిచ్చి వర్ణనలతోని మైండు బ్లాంకు అయ్యె.

అయితే బొమ్మ బాగుంది.

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...