నేను చాలా అభిమానించే వ్యక్తి దర్శక నిర్మాత గురుదత్. వీరి గురించి మిత్రులు Dr. Prasad Kvs గారి అందించిన వివరాలు. చాలా విషయాలు తెలిసినవే కాని తెసినకొద్దీ తెలుసుకోవాలనే ఓ గొప్ప సినిమా దిగ్గజం గురుదత్. Dr. Prasad గారికి నా ధన్యవాదాలు.
వక్త్ నే కియా క్యా హసీ సితం!
తుం రహే న తుం,
హం రహే న హం!
కాలం ఎంత పని చేసిందో చూశావా? నువ్వు నువ్వుగా లేవు! నేను నేనుగ లేను!
కాగజ్ కె ఫూల్....మూవీ లో గీతాదత్ ఆలపించిన ఈ సోల్ స్టర్రింగ్ మెలొడీ....ఆమెకే వర్తించింది!
కాలాన్నో...దైవాన్నో...విధినో ఎందుకు ధూషిస్తావ్? ఏదైనా చేసేది నువ్వేగా!?....అని గురుదత్ ను నిలదీస్తే....
కాలం కాదు....దైవం కాదు....విధి కాదు......ఇది మనస్సు చేసే మాయ గీతా....నా మనస్సు నా చేతిలో లేకుండా ఆడిస్తోంది చూడు అంటాడు!
మనస్సు మగవాళ్ళకే ఉంటుందా? స్త్రీలకా భాగ్యం లేదనుకుంటారా!? మనస్సు పేర...ఆడవారు మరో పురుషుని సాన్నిహిత్యం కోరితే....ఈ పురుష పుంగవులు ఒప్పుతారా?
అందుకే...నా మనస్సు చెప్పినట్లు నేను నడుచుకున్నాను. ముగ్గురు పిల్లలతో...ఇల్లు వదిలి...గురును వదిలి వచ్చేశాను.
నాకు నేను న్యాయం చేసుకోవాలి కదా.
నా ఆత్మ గౌరవం నేను కాపాడుకోవాలి కదా.
***********
ఎలా చెప్పాలి? గీత తో ఏం చెప్పి ఒప్పించాలి? నా మనస్సు పరాధీనమౌతోందని....ఆరాధన అన్యాక్రాంతమౌతోందని...తన ప్రియ సతి గీత తో ఎలా చెప్పాలి?
గీతను నొప్పించలేను. మనసును ఒప్పించలేను! ఇప్పటికీ గీతంటే తన సర్వస్వమే! ఎంత కోరుకుని చేరువయ్యాం!
1951 లో బాజీ షూటింగప్పటికే ... గీత బాగా పేరున్న సింగర్. తన రూపం...గాత్రం అద్భుతం అనిపించాయి.
నా దర్శకత్వపు శైలి తనకెంతో నచ్చి... పరస్పర ఆకర్షణ తో...3 ఏళ్ళు ప్రేమలో మునిగి...
వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకున్నా....పెళ్ళాడేశాం!
వర్క్ అంటేనే ఓ పాషన్. దాన్లో మునిగి....కాలం తెలియనేలేదు.
ప్రపంచం గుర్తించే సినిమాలు తీయాలి. ముగ్గురు పిల్లలు పుట్టేశారు.
గీతా పాటలు తగ్గించి...పిల్లల ఆలనా పాలనా...చూచుకుంటుంటే...హాయిగా కాలం గడిచి పోతోంది.
అబ్రార్ అల్వి...తన వర్కింగ్ పార్ట్నర్ తో హైదరాబాద్ వెళ్ళి....రోజులు మారాయి....సినిమా చూడకుంటే....అసలు నాకీ సమస్య వచ్చేది కాదేమో!
కరెక్ట్ గా తనకు సరిపడే రోల్ సి.ఐ.డి.లో ఉంటే....ఆ డాన్సర్ వహీదా రెహమాన్ ను బొంబాయి పిలిపించి....ఆఫర్ ఇవ్వడం. ఇక ఆ రోల్ లో తను నటిస్తుంటే....నర్తిస్తుంటే....తన మనస్సు...శృతి తప్పడం మొదలైంది!
తన ప్యాసా....మూవీలో ముఖ్య పాత్ర ఇస్తే....చాలా గొప్ప మూవీ అయ్యింది. ఆన్ స్క్రీన్ హిట్ జంటగా పేరొచ్చింది. అసలా రోల్ దిలీప్ కుమార్ కు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశాడు. ఇది దేవదాసు లాగే ఉంది...అంటూ.
లేకుంటే ప్యాసా లో హీరో పాత్ర నేను వేసి ఉండే వాడిని కాను! ప్యాసా....మమ్మల్ని మరింత దగ్గర చేసింది.
3 ఏళ్ళ కాంట్రాక్ట్ లో వహీదా....తన ప్రతిభ మరింత చూపింది. కాగజ్ కె ఫూల్, చౌంద్ వీ కా చాంద్, సాహిబ్ బిబీ ఔర్ గులాం...అన్నీ మంచి మూవీలే!
కానీ నా మనస్సు ఈ సినిమాల మీద లేదు. అంతర్జాతీయంగా పేరు తెచ్చే విధంగా ఉండాలి ఇండియన్ మూవీస్....అనుకుని ప్రొమోట్ చేసేందుకు విదేశాలు చుట్టాము.
కొంచెం శ్రమ పడితే...హిందీ మూవీలకు ప్రపంచ మార్కెట్ సులభంగా వస్తుందని గ్రహించాను.
కానీ గీతా.....మారిపోయింది. అనుమానం తో వేధింపులు ఎక్కువయ్యాయి. నా మీద నిఘా ఎక్కువ చేసింది. ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా గూఢచారులను నియమించుకుంది.
వహీదా అంటేనే మండి పడుతోంది. మళ్ళీ బయట పడదు. వహీదా సమక్షంలో ఎంతో ప్రియంగా మాట్లాడుతుంది! నువ్వే మా లక్కీ మస్కట్....అంటుంది! పరోక్షంలో...నరకం చూపిస్తుంది.
************
నిజమే నా మెంటర్ గా గురు ను ఒప్పుకుంటాను. ప్యాసా(57), కాగజ్ కె ఫూల్(59).....కాగజ్ కె ఫూల్ విడుదలైనప్పుడు....డిజాస్టర్ అయ్యి గురు ను డిప్రెస్ చేసింది!
ఇప్పుడందరూ క్లాసిక్ అని మెచ్చుకుంటున్నారు! గురు ఎప్పుడూ...కాలంతో పయనించడు. ఓ పది అడుగులు ముందే ఉండేవాడు! వర్తమానం అనవసరం! ఓ స్వాప్నికుడు!
విదేశీయుల కుండే స్వేఛ్ఛ....ఇండియాలో లేదంటాడు. సమాజం...ప్రక్కవారి గురించి పెద్దగా పట్టించుకోని స్వభావం....లివింగ్ టుగెదర్ లు....విదేశాలలో సాధ్యం.
ఇప్పుడంటే....ఆ సంస్కృతి ఇక్కడకొచ్చేసింది కానీ...అప్పట్లో అది నాకు నచ్చేది కాదు. అక్కడే స్పర్ధలోచ్చాయి గురుతో!
అయినా పెళ్ళై...ఇద్దరు పిల్లలున్న గురుదత్....నన్ను పెళ్ళాడనుకోవాలనుకోవడమేమిటి? గీత....కూడా నాకెంతో చక్కటి ఫ్రెండే. ప్రొఫెషనల్ లైఫ్ వేరు...పర్సనల్ లైఫ్ వేరు. ఈ రెంటి మధ్య సమన్వయించుకోగల సంయమనం నాకుంది.
ఎవరి మూవీస్ వారికున్నాయి. వాటితో దూరం పెరిగింది.
చౌంద్వీ కా చాంద్(60)లో మళ్ళీ గురు తో నటించే ఛాన్స్ వచ్చినా......
మనసులో ఏర్పడ్డ దూరం....దూరం గానే ఉంది!
రూప్ కి రాణి చోరో కా రాజా(61),బీస్ సాల్ బాద్(62).....
మళ్ళీ సాహిబ్ బిబీ ఔర్ గులాం(62) లో గురుదత్ తో కలిసి నటించడం. నా చుట్టూ ఓ గోడ కట్టేసుకున్నా.
కెరీర్...ఇంత మంచి స్థితిలో ఉండగా...పెళ్ళంటే విముఖత లేదు గానీ...ప్రాక్టికల్ గా ఉంటూ...సర్దుకు పోయే మంచి వాడు కావాలి నాకు. ఎటువంటి పరిస్థితిలో ఈ కెరీర్ ను త్యాగం చేయలేను.
జూలై- 27- 1963....నా జీవితం లో మరచిపోలేను! మొట్టమొదట టి.వి. చూడగలిగాను!
బెర్లిన్ చలనచిత్రొత్సవం కు సాహిబ్ బీబి ఔర్ గులాం ప్రదర్శనకు వెళ్ళి...ఆ రోజు ఉదయమే...టి.వి. లో మొట్టమొదట...అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీని చూశాను.
ఆ సాయంత్రమే మా మూవీ ప్రదర్శన జరిగింది. పెద్దగా నచ్చలేదు విదేశీయులకు మా మూవీ.
గురూ...షరా మామూలే. బాగా డిప్రెస్ అయ్యాడు.
**********
గురు లో అసలు నాకు నచ్చని క్వాలిటీ ఇదే. చీటికి మాటికి...డిప్రెషన్ అంటాడు. దాని పేరుతో....మందు మత్తుకు, సిగరెట్లకు...నిద్ర మాత్రలకు దగ్గరయ్యేవాడు!
సృజనాత్మకత...భావుకత ఉంటే చాలా! చిటికెడు లౌక్యం కూడా ఉండాలి. బ్రతుకు లోని తీపైనా...చేదైనా....డోంట్ కేర్ అంటూ ముందుకెళ్ళాలి. దాని అంతు చూడాలి.
నిన్ననే...బొంబాయి నుండి మద్రాస్ వచ్చాను....ఎంతో హాయిగా...ఆనందంగా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కాల్సొచ్చింది....ఇది అనుకోని పయనం. కళ్ళలో నీళ్ళు నిండుకుంటున్నా...గుండె చిక్కబట్టుకుని....గీతాదత్ ఇంటికి చేరుకున్నా!
అప్పుడే....అంతిమయాత్ర మొదలయ్యింది. పేటిక గుమ్మం దాటివచ్చేస్తుంది. వెనకాల శోకమూర్తిలా గీత....తనకు ఓదార్పునిస్తూ..భుజాలను పట్టుకుని....మీనాజీ!
చివరిచూపు కూడా సరిగ్గా చూడలేదు! వీడ్కోలు పలికేందుకొచ్చిన వారు ఏదో ఓదార్పు మాటలంటున్నారు. కానీ....తనతో ఎవ్వరూ మాట్లాడటం లేదు!*
గురు...ఆత్మహత్య కు....నేనే కారణమన్నట్లు....ఆ చూపులు గుచ్చుకుంటున్నాయి!అక్కడ ఉండలేక...తిరుగు టపా అయ్యాను!
************
దీపికా పడుకోన్ అందరికీ తెలుసు. ప్రకాష్ పడుకోన్ కూడా తెలిసేఉండొచ్చు!
కానీ వసంతకుమార్ శివశంకర్ పడుకోన్......అంటే....ఎవ్వరికీ తెలిసి ఉండక పోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ 100 మూవీస్ లో ఆయన తీసిన 2 మూవీస్ ఉన్నాయి !
ఆసియాలోనే......బెస్ట్ 25 యాక్టర్స్ లిస్ట్ లో ఆయన పేరుంది!
టైం మాగజైన్....సైట్ & సౌండ్ మాగజైన్లు ....వారి కీర్తిని వేనోళ్ళ పొగిడాయి!
ఆయన తీసిన 2 సినిమాలు (ప్యాసా & కాగజ్ కె ఫూల్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లో పాఠ్యాంశాలు!
*************
ఆయన మీకూ బాగా తెలిసిన వారే...గురుదత్ జీ. కొంతమంది...చాలా తక్కువ కాలం భూమిపై నడయాడినా....వారి పెద్ద పాదముద్రలు....మన భూమండలం మీద మిగిల్చి పోతారు! అలాంటి జీనియస్ గురుదత్!
బెంగుళూర్ లో పుట్టినా....డాన్స్ మీద మక్కువతో ఉదయశంకర్ ట్రూప్ లో చేరారు. 1944 లో ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ లో కొరియోగ్రాఫర్ & అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరినప్పుడు....ఆయనకు దేవ్ ఆనంద్ ...బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.
చాంద్(1944), లఖా రాణి(45) లలో నటించినా....తనే దర్శకత్వం వహించిన బాజి(1951)(హీరో దేవానంద్) రిలీజ్ అయ్యేంతవరకు గుర్తింపు రాలేదు!
మొదటి నుండి దర్శకత్వం, ప్రొడక్షన్ మీదే దృష్టి. ఆ తరువాత 1953 లో గాయని గీతా రాయ్ ని పెళ్ళాడి గీతా దత్ ను చేశాడు.
ఆర్ పార్(1954), మిస్టర్ & మిసెస్ 55(1955) లాంటి మూవీస్ లో నటించినా...ఈ రెగులర్ కమర్షియల్ ఫార్మెట్స్....ఏ మాత్రం సంతృప్తినిచ్చేవి కావు!
ప్రపంచ వ్యాప్తంగా...అభినందించగలిగే మూవీస్ తీయాలి. అవి ఫారిన్ కంట్రీస్ లో కూడా పేరు తెచ్చుకోవాలి.ఇదీ అతని ధ్యేయం!
*************
ప్రజలకు...మా లగ్జరీలు, కార్లు, బంగళాలు, ఫారిన్ టూర్లు ....ఇలాంటివి కనిపిస్తాయి గానీ...వాటికోసం...మేము ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేరు!
అవి పొందడానికి...మేమెంత మూల్యం చెల్లిస్తున్నామో కూడా ఐడియా ఉండదు!....అనేవాడు గురుదత్!
ప్యాసా(1957) & కాగజ్ కె ఫూల్(1959) రెండు మాస్టర్ పీసెస్ తీశాడు గురుదత్.
ప్యాసా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అదే తెలుగు లో 20 సంవత్సరాల తరువాత మల్లెపువ్వు గా తెలుగు లో తీశారు!
కాగజ్ కె ఫూల్....అందరూ మెచ్చుకున్నా....డబ్బు రాలలేదు! ఇంత చక్కటి ఫిల్మ్...తీసినా...ప్రజలకు పట్టలేదంటే.....ఇక నేనసలు చిత్రాలు డైరెక్ట్ చేయను ...అని పట్టుబట్టి...అది చివరిదాకా నిలుపుకున్నాడు.
ఆయన పోయిన తరువాత....కాగజ్ కె ఫూల్ ....ప్రపంచ వ్యాప్తం గా పేరొంది....క్లాసిక్ గా గుర్తింపు పొందింది..మరి! అదే చిత్రం!
***********
1964 దాకా నటిస్తూనే ఉన్నాడు. ఆ సంవత్సరంలోనే.....బహారే ఫిర్ భి ఆయేంగా లో ఓ సీన్ నటించి...హోటల్ కెళ్ళాక....రాత్రి నిద్రించే ముందు....
గీత కు ఫోన్ చేశాడు. పిల్లల్ని చూడాలని ఉంది...ఓ సారి పంపమని. పంపనని గీత ఖచ్చితంగా చెప్పింది!
నిద్రించిన తరువాత మరి తెల్లవారి లేవ లేదు!
శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు .
ఓవర్ డోస్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్ అంటారు.
పిల్స్ & ఆల్కహాల్ అంటారు!
బహారే ఫిర్ భి ఆయేంగి......వసంతం మళ్ళీ వస్తుందని ఎదురుచూడాలి కదా.
కానీ గురుదత్ అంత వరకు ఎదురు చూడలేదు. ఆ మూవీ ధర్మేంద్ర తో పూర్తి చేశారు.
ఏదైనా...ఈ సినీ జీవితాల లోని....మాయామేయాలు .....అంతర్ముఖుడైన(ఇంట్రావర్ట్) గురుదత్ జీర్ణించుకోలేక పోయాడు.
మరలి రాని లోకాలకు తరలి పోయాడు 39 ఏళ్ళకే!
వారి సినిమాలు మాత్రం శాశ్వతమై మిగిలాయి!
1 కామెంట్:
Interesting.
Some are born to achieve somethings and he has done it in a small time that he has lived.
కామెంట్‌ను పోస్ట్ చేయండి