21, మార్చి 2021, ఆదివారం

నిండు హృదయాలు - కవితా దినోత్సవం సందర్భంగా కవిత


 నిండు హృదయాలు

తోడుగా నువ్వుంటే
గూడులో నావెంటే
నీ ఒడిలో ఈ ఎదలో
పండేదే మన జీవితం
మాసిపోని తీపి గురుతులు
ఏడ ఏడని వెతుకుతుంటే
మన అడుగుజాడల జ్ఞాపకాలలో
ఏడు అడుగులు కంటపడెను
బిడ్డలంతా రెక్కలొచ్చి
ఏడకేడకో ఎగిరిపోగా
గుండె గుడిగా చేసుకుంటూ
మనసు గంటగా మార్చుకుంటూ
ఎండమావులు ఎదురైనా
అలసిపోని వలపు తోడై
ఎన్ని కష్టాలెదురైనా
ఓడిపోని గెలుపు మనదై
పడి లేచే కెరటంలా
వడివడిగా వరవడిగా
ఓడలాగా సాగిపోదాం
పండుటాకులా రాలిపోదాం
✍️ జికె దువ్వూరి

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...