26, మార్చి 2021, శుక్రవారం

నన్ను కోల్పోయిన నేను - కవిత


My charcoal pencil drawing



నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వ గారి కవిత


నన్ను కోల్పోయిన నేను...మౌనిమనౌతు
నిన్నలో దాచిన నిన్ను ...!
నిన్నలో కూరుకుపోయిన నన్ను, పెకిలించనీ
మనసుపొరలలో లిఖించిన...
రాలుతున్న భావకుసుమాల దారిలో
నడకను సాగించనీ
బతుకు తీవకు అక్షరసుమాలు అద్దుకుంటూ...!
ఒలుకుతున్న భావాలు...కన్నీరై..
నిద్దరను చెరిపిన రాతిరి...ఆవిరై
పులుముకున్న నిశ్శబ్దం...ఏకాంతమై.
కలత నిద్దుర...నేస్తమయ్యిందీవేళ.
తలపులను జోకొట్టలేక...
మనసును మభ్యపెట్టలేక..
అలముకున్న నిర్లిప్తత..
వినగలిగితే ఎన్ని సడులో..జాలువారుతూ
నవ్వులద్దుకున్న క్షణాలు...ఎంత భారమౌ...
అడిగారా ఎప్పుడైనా...!
అవశేషాల ప్రేమలో.. ఎందుకీ వెతుకులాట?
మనసుకి గంతలు కట్టుకుని...!!
..
కాలానికి.. కన్నీటి తర్పణం విడచి
సెలవీయక తప్పదిక...!!

 

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...