22, మార్చి 2021, సోమవారం

నన్ను నాలా ఉండనీ - కవిత



నన్ను నాలా ఉండనీ .. కవిత (సుగుణ అల్లాణి గారి సౌజన్యంతో) (ఈ కవితకి నా pencil రేఖల చిత్రం)


నన్ను నాలా ఉండనీ...
కూతురుగానో కోడలిగానో భార్యగానో అమ్మగానో కాక
ఒక్కసారి నన్ను నాలా ఉండనీ
ఎప్పుడో పసితనం లో అమ్మ ఒడి లో
నేను నా కోసం చిందించిన లేత నవ్వులు
మళ్లీ ఒక్కసారి నన్ను నాలా నవ్వనీ!!
నా మనుసు గిలిగింతలు పెట్టి రాగాలు తీస్తుంటే
నాపాదాలు అందుకనుగుణంగా కదలాలనుకుంటే
వింత చూపు చూసి వారించకు...
నాలా నన్ను ఆడనీ...
నా మదిలో మెదిలే మృదుభావం
నా పెదవులమీద గమకాలు పలకనీ
నా పాట శృతి లో లేకుంటే ఏం?
నాపాటను నాలా పాడనీ
నా ముత్యాల పలువరుస కనిపించేలా
నా గొంతులో సవ్వడి వినిపించేలా
నవ్వాలనిపిస్తే వేలడ్డం పెట్టి హుష్షని ఆపకు....
నాలా నన్ను నవ్వనీ
నా ఓటమిని నన్ననుభవించనీ
నిరాశ నిశీధుల్లో నన్ను ఒంటరిగా తిరగనీ
నా కన్నీటిని నాదోసిలిలోనే పడనీ
నా గెలుపు దారులను నన్ను వెదకనీ
ఆశా జ్యోతులను వెలిగించుకోనీ
ఆకాశపుటంచులకు నా ఆశయాల రెక్కలు చేరనీ
.................ఒక్క సారి నన్ను నాలా ఉండనీ
.......✍️సుగుణఅల్లాణి


 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...