4, మార్చి 2021, గురువారం

అలసిన గీతలు

మోనాలిసా చిత్రం తో నన్నే పోలుస్తున్నా ,
కిన్నెరసానివే అంటూ కనులారా వీక్షిస్తున్నా ,
నండూరి ఎంకిలా  వుందంటున్నా   ,
వరూధినీని తలదన్నే  ప్రతి రూపాన్నే నేనంటున్నా .....  

నీ  అలసిన గీతలతో  
నా సొగసు రూపు రేఖలు మార్చావు . 
నీ గజి బిజి ఆ 'లోచనలు'
నా జిగి బిగి  కనుమరుగయ్యేలా చేసావు.

వన్నె తగ్గిన వర్ణాలతో  
ప్రౌఢ వయసు మరకలు అంటించావు.
ఊహల్లో కూడా  బ్రతకనియ్యవా 
నే అలిగితే నీకు కోపం 
"చిత్రం"గా మార్చింది  నీ శాపం .

         ✍️లక్ష్మీ అయ్యగారి 

  Pvr murty అంకుల్ చిత్రానికి 

           కూర్చి పేర్చిన అక్షరాలు

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...