25, మార్చి 2021, గురువారం

ఆటవెలది పద్యాలు





నా చిత్రాలకి చక్కని ఆటవెలది పద్యాలు రచించిన శ్రీమతి పద్మజ మంత్రాల కి నా శుభాశీస్సులు.




 #ఆటవెలది#

సందెప్రొద్దు వేళ స్నానమాడి పిదప
నేతచీర గట్టి నీటుగాను
విరుల సరములల్లె విరిబోణి సొగసుగా
కురులయందు తురుముకొనుట కొరకు!

----------------------------------------------------------------------------------------------------------


#ఆటవెలది#
ఉసురు పోసి మనల కొక రూపమందించు
నామె పంచు ప్రేమ కంతు లేదు!
అవని వంటి సహన మమ్మకే సాధ్యమౌ
నిలను జనని సాటి యెవరు లేరు!

-------------------------------------------------------------------------------------------------------------



#ఆటవెలది#
కనులు మూయగానె కనిపించి గతమేదొ
కలలు చెదిరిపోయె కలికి కకట!
మరపురాని బాధ చెరుగుచుండ మదిని
నిదుర దూరమాయె కుదురు లేక!

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...