పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు
(Pencil drawing by me)
అద్భుత సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ,-- (1917-1984) పెండ్యాల గారి జయంతి సందర్భంగా నా నివాళి. 2920 మే నెలలో 'తెలుగుతల్లి కెనడా ' పత్రికలో నేను చిత్రీకరించిన పెండ్యాల గారి చిత్రం ప్రచురించబడింది. పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు.
పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత
దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి
తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ
పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు.
పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లిప్రేమ (1941),
సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా
పనిచేశారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా
కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర
సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ,
హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా
చేసి వినిపించగల సమర్థుడని పెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు
సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు (1955), ముద్దుబిడ్డ (1956),
భాగ్యరేఖ (1957), జయభేరి (1959), మహామంత్రి తిమ్మరుసు (1962),
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), రాముడు భీముడు (1964), శ్రీ కృష్ణ
తులాభారం (1966) కొన్ని చాలు - వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి
సంగీతం గురించి చెప్పుకోవడానికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి