31, మే 2021, సోమవారం
మహానటి నర్గీస్ - Nargis
28, మే 2021, శుక్రవారం
మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాలా - అన్నమయ్య కీర్తన
25, మే 2021, మంగళవారం
విరసముగ మారి విరహము - కంద పద్యం
నా pencil చిత్రానికి శ్రీమతి పద్మజ మంత్రాల రచించిన ఓ చక్కని కంద పద్యం.
చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదాలతో...
#కందము#
విరసముగ మారి విరహము
నరనరమును తోడుచుండి నలిగులి చేయన్...
వరమో మరి శాపమ్మో
కరిగిన కలలన్ని మెదిలె కలికి మనమునన్!
23, మే 2021, ఆదివారం
రామ్-లక్షణ్, SP బాలసుబ్రహ్మణ్యం అనుబంధం
22, మే 2021, శనివారం
సాహిర్ లూఢియాన్వీ - Sahir Ludhianvi
సాహిర్ లుధియాన్వీ (1921-1980), సుప్రసిద్ధ ఉర్దూ కవి, ఎన్నో హిందీ సినిమాల గేయరచయిత. ఇతడి పేరు "అబ్దుల్ హయీ", కలంపేరు "సాహిర్", లూధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా 'మాంత్రికుడు' (జాదూ చేసేవాడు), సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలంపేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.
బాలీవుడ్ లో తన ప్రస్థానం మొదలెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, ఓ రెండు దశాబ్దాలుగా వెలుగొందాడు. హిట్టయిన ప్రతిచిత్రం ఇతడి రచించిన పాటలు కలిగివుండేది.
- కభీ కభీ చిత్రంలోని పాట;
- "మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై
- ప్యాసా చిత్రంలోని ఈ పాట అప్పటి ప్రధానమంత్రియైన జవహర్లాల్ నెహ్రూను సైతం కదిలించివేసింది.
- "యే కూచే, యె నీలామ్ ఘర్ దిల్‌కషీ కే,
- యె లుట్‌తే హువే కారవాఁ జిందగీ కే,
- కహాఁ హైఁ, కహాఁ హైఁ ముహాఫిజ్ ఖుదీ కే,
- జిన్‌హే నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ,
సాహిర్ వ్రాసిన కొన్ని పాటలు;
- ఆనా హై తొ ఆ (आना है तो आ) - నయా దౌర్ (1957) - స్వరకల్పన ఓ.పి.నయ్యర్.
- యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై (ये दुनिया अगर मिल भी जाए तो क्या है) (ప్యాసా -1957), స్వరకల్పన ఎస్.డి.బర్మన్.
- తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా (तु हिंदु बनेगा ना मुसलमान बनेगा) - ధూల్ కా ఫూల్ (1959), స్వరకల్పన దత్తా నాయక్.
- యే ఇష్క్ ఇష్క్ హై (ये ईश्क ईश्क है ) - బర్సాత్ కి రాత్ (1960), స్వరకల్పన రోషన్.
- నాతో కారవాఁకీ తలాష్ హై (ना तो कारवाँ की तलाश है) - బర్సాత్ కీ రాత్ (1960), స్వరకల్పన రోషన్.
- అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్ (अल्ला तेरो नाम ईश्वर तेरो नाम) - హమ్ దోనో (1961), స్వరకల్పన జయదేవ్.
- చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో (चलो ईक बार फिर से अजनबी बन जाए हम दोनो ) - గుమ్‌రాహ్ (1963 ) - స్వరకల్పన రవి.
- మన్ రే తూ కాహే న ధీర్ ధరే (मन रे तु काहे ना धीर धरे?) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.
- సంసార్ సే భాగే ఫిర్తే హో, భగవాన్ కో తుమ్ క్యా పావో గే (संसारसे भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.
- ఈశ్వర్ అల్లా తేరే నామ్ (ईश्वर अल्ला तेरे नाम) - నయా రాస్తా (1970) - స్వరకల్పన దత్తానాయక్.
- మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ (मै पल दो पल का शायर हुँ) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.
- కభీ కభీ (कभी कभी) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.
- సాహిర్ రచించిన కొన్ని అద్భుతమైన సూపర్ హిట్ పాటలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినొచ్చు ..
- https://www.youtube.com/watch?v=outkSx58IjQ
19, మే 2021, బుధవారం
నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!
మిత్రులు శ్రీ Suresh Ganti గారి గజల్ కి నా చిత్రం. అనుమతించిన సురేష్ గారికి ధన్యవాదాలు..
మనసిచ్చిన నెచ్చెలివని మనసు నీకె ఇచ్చాను
నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!
నీ వలపన్నదె గెలుపని నే పోరాటమె చేస్తున్నా
నీ నులి సిగ్గుల మొగ్గలైన ఆ ముద్దు మోమె చాలులె!
కనురెప్పలె ప్రమిదలుగ ప్రేమ జ్యోతులు వెలిగించాను
నీ చిరునవ్వులు చిందించెడి ఆ ముద్దు మోమె చాలులె!
నా తలపులు నా వలపులు నీవేనని చెపుతున్నా!
మెరిసెడి కన్నుల నవ్వెడి నీ ముద్దు మోమె చాలులె!
ఈ జన్మకు ప్రతి జన్మకు నా ప్రేయసివిక నీవన్నా!
నీ అరచేతిలొ దాచుకున్న ఆ ముద్దు మోమె చాలులె!
నా తనువూ, మనసూ నీకై తహతహ మని అంటున్నా!
నీ ఎరుపెక్కిన బుగ్గలసిరి ముద్దు మోమె చాలులె!
నా కలలో, ఇలలో నీకై , కలవరపడి చూస్తున్నా!
మనసున మరులను రేపే నీ ముద్దు మోమె చాలులె!
రచన ~ సురేష్ గంటి.
16, మే 2021, ఆదివారం
ముబారక్ బేగమ్ - కభీ తన్హాయియోమేఁ హమారీ యాద్ ఆయేగీ
మన మహనీయులు : సర్ ఆర్థర్ కాటన్ - శ్రీ వీణం వీరన్న
కాటన్ దొర అంటున్నామే గానీ ఆయనకు సహకరించిన తొలి తెలుగు ఇంజనీర్ వీరన్న గారిని విస్మరిస్తే ఎలా.. ? కొన్ని విషయాలను గూగుల్ నుండి సేకరించాను
కింద మేటర్ చూసి సగం మందికి పైనే పూర్తిగా చదవను కూడా చదవరు ... కానీ ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఇది ...
మన గోదావరి జిల్లాల ప్రాంతాలు ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి #ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కారణం మరి దానికి కారణం ఎవరు అంటే మనం టక్కున శ్రీ సర్ ఆర్థర్ కాటన్ ( #కాటన్_దొర ) గారు అని తడుముకోకుండా చెప్పేస్తాం. ఈ గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’ లా మార్చిన కాటన్‌దొర గారికి వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు అంటే దాదాపు చాలా మందికి తెలియదు.
చరిత్ర ‘చీకట్ల’లో కలసిపోయిన ఆయన పేరే శ్రీ #వీణం_వీరన్న గారు ... ఎక్కడో బ్రిటిష్ వారు అయిన కాటన్ దొర కు తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తలకెత్తుకున్న ఆయనకు తలలో నాలుకలా నిలిచారు వీరన్న గారు ... కాటన్ దొర గారికి వీరన్న గారు సాయం రాకపోతే ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పటికి పూర్తయ్యేదో అన్నది ప్రశ్నర్ధకం ...!!
శ్రీ వీణం వీరన్న గారు వీరరాఘవమ్మ, కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న జన్మించారు... తండ్రి కొల్లయ్య మచిలీపట్టణంలో బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా చేసేవారు... దాంతో వీరన్న గారిని తల్లితోపాటు #రాజమండ్రిలో బంధువుల ఇంట్లో విడిచి ఉండేవారు... అలా వీరన్న గారి ప్రాథమిక విద్యను రాజమండ్రిలో పూర్తి చేసుకున్నారు. ధవళేశ్వరానికి చెందిన శ్రీమతి వెంకాయమ్మ గారితో వీరన్న గారికి వివాహమైంది. వారికి వెంకటరత్నం, జనార్దనస్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు సంతానం.
మచిలీపట్టణం ఆంగ్లోఇండియన్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న గారు, తన తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్ చదివేందుకు బెంగాల్ వెళ్లారు. అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తా ... ఇంజినీరుగా ఆయన శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది.
1840 నాటికి #రాజమండ్రి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే... 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన శ్రీ ఆర్థర్ కాటన్ గారితో #వీరన్న గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్ దొరకు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్ దొర నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి వీరన్న గారే చూసుకునేవారు. తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్న గారిని కాటన్ దొర సోదర సమానుడిగా గౌరవించేవారు ....
ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని ఆ కాలంలో... కాటన్ దొర తో పాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను #వీరన్న గారు పర్యవేక్షించారు. రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం., ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్ దొర విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో వీరన్న గారు ఆయన వెన్నంటి ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వారిద్దరూ ... అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగిపోయేవారు.
ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, #కృష్ణా_జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్ కాలంలో దేశాన్ని ఎన్నో కరవులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారినపడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు..
దానితో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనిని కాటన్ దొర గారిని నియమించింది... దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్ గారితో కలిసి వీరన్న గారు మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు.
ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఒడిశా, బెంగాల్‌ల నుంచి వందలమందిని ధవళేశ్వరానికి రప్పించారు. వీరన్న గారు వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు . ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకువచ్చారు. వీరన్న గారు తన కుటుంబానికి ఉన్న పలుకుబడి పరిచయాలతో మన్యప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు. పనికి కొత్తయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహపరిచేందుకు... పనిచేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు. ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారులంటే విశ్వాసం పెరిగేలా చేసింది. వీరన్న గారు శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన.
1848, 1851లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా పనులు ఆగకుండా శ్రామికులను వీరన్న గారు ఉత్తేజపరిచారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు, ఇటు శ్రామికులు ఒకరికొకరు సహకరించుకునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు ఉండేవాళ్లు. దానికితోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్ దొర, వీరన్న గారి పట్ల ఆంగ్లేయ ( బ్రిటిష్ ) అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు. వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనూ వీరన్న గారు, కాటన్ దొరల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడిసరకులను ఎప్పట్లా సరఫరా చేసింది.
చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకి వచ్చాయి.
వీరన్న గారి సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకితభావం కారణంగానే తన కల నెరవేరిందని గ్రహించిన కాటన్ దొర ఆంగ్లంలో స్వదస్తూరితో ‘శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని’ అని రాసుకున్నారు. ఇంతేకాకుండా వీరన్న గారి శ్రమకు ప్రతిఫలంగా ... ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు.
దాని ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది. అంతేకాదు ఆయనకు ‘#రాయబహుదూర్’ బిరుదునిచ్చి సత్కరించింది... ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్ దొర అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు. అయినా వీరన్న గారు కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు. నిర్మాణ సమయంలోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి... చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారాయన.
1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటినుంచి 1867లో మరణించేవరకు ధవళేశ్వరం హెడ్‌లాక్ క్వార్టర్సే వీరన్న గారి చిరునామాగా ఉంది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. అంతేకాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న గారి పేరును ఆంగ్లంలో '‘వి.వీరన్న ,., రాయ్‌బహుదూర్,, సబ్‌ఇంజినీర్, 1867’ అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు. ఇప్పుడు ఆ ప్రదేశం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. 1940లో బులుసు సాంబమూర్తి కాటన్ దొర విగ్రహం దగ్గరే వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు.
1986లో వచ్చిన వరదలో కాటన్ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన ‘కాటన్ మ్యూజియం’లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడది మసకబారిపోయింది. తనకెంతో సాయమందించిన వీరన్న గారిని కాటన్ దొర మరచిపోలేదు. కానీ మనం మర్చిపోయాం.
ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకోవడం ఎంతో అదృష్టం ., అయితే భావి తరాలకు ఇలాంటి గొప్ప వారి గురించి తెలిసేలా ప్రభుత్వాలు ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ., ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.
అన్నం పెట్టిన మనిషిని గౌరవించడమంటే .... మనల్ని మనం గౌరవించుకోవడమే కదండి..!
14, మే 2021, శుక్రవారం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంలో నేను వేసుకున్న చిత్రానికి నా మిత్రులు facebook లో చక్కని పద్య స్పందన ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి పద్య రచనలను క్రిందన పొందుపరుస్తున్నాను.
పలుకుతేనెల తల్లి పవళించెను - గానం కే. శే. KBK Mohan Raju
"పలుకు తేనెల తల్లి పవళించెను" ఇదొక అద్భుతమైన అన్నమయ్య కీర్తన. ఈ కీర్తన పలువురు గాయకులు ఆలపించారు. నా మిత్రులు స్వరీయ KBK మోహన్ రాజు గారు కూడా పాడినట్లు నాకు తెలియదు. వారు పాడిన ఈ కీర్తన వారి కుమార్తె శ్రీమతి ఉషా మోహన్ రాజు నేను చిత్రీకరించిన చిత్రాన్ని జోడించి facebook లో పెట్టారు.
ఆ లింక్ ఈ క్రిందన ఇస్తున్నాను. విని ఆనందించండి.
ధన్యవాదాలు.
12, మే 2021, బుధవారం
Florence Nightingale - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
My pencil sketch of Florence Nightingale, the founder of modern nursing.
కరోనా నేపథ్యంలో రేయనక పగలనక నిర్విరామంగా పనిచేస్తున్న నర్సమ్మలందరికీ International Nurses Day శుభాకాంక్షలు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో 'నోట్స్ ఆన్ నర్సింగ్' అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్' సంస్థ 1965 నుండి నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.
(Details courtesy : wikipedia)
10, మే 2021, సోమవారం
ప్రముఖ తత్వవేత్త " జిడ్డు కృష్ణమూర్తి "
- ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త 'జిడ్డు కృష్ణమూర్తి; - నా pencil చిత్రం.
- భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు.
- మనస్సు, హృదయం నిశ్చలంగా వుంటే ఉత్సాహం లభిస్తుంది.
- అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం క్రింద చలామణి అవుతుంది.
- అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
- రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
- ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది.
9, మే 2021, ఆదివారం
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
మిత్రులు కృష్న దువ్వూరి గారు 'మాతృదినోత్సవం' సందర్భంగా నా చిత్రాలతో చేసిన ఓ చక్కటి వీడియో క్రింది లింక్ క్లిక్ చేసి తిలకించండి.
https://www.facebook.com/100001757057958/videos/4037118923023303/
6, మే 2021, గురువారం
ఆచార్య ఆత్రేయ - శత జయంతి స్మృత్యంజలి. - pencil sketch
'మనసు కవి/' ఆచార్య ఆత్రేయ శత జయంతి స్మృత్యంజలి - ఈ సందర్భంగా మిత్రులు డా. ప్రసాద్ కె.వి.యస్ గారు ఈ మహనీయుని గురించి చాలా అద్భుతంగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందించిన వివరాలు నలుగురికీ తెలియాలనే సదుద్దేశ్యంతో యథాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...