31, మే 2021, సోమవారం

మహానటి నర్గీస్ - Nargis



Nargis - My pencil sketch


భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన ఓ మహా నటి నర్గీస్ ఆమె గురించి నేను సేకరించిన వివరాలు క్లుప్తంగా :

నర్గిస్ జూన్ 1, 1929 న బ్రిటిష్ ఇండియాలోని రావల్పిండిలో ఫాతిమా రషీద్ గా జన్మించింది , జద్దన్బాయి మరియు ఉత్తమ్చంద్ మోహన్చంద్ ల కుమార్తె. ఈమె తండ్రి మాజీ హిందూ మొహయల్ బ్రాహ్మణుడు, ఇస్లాం మతంలోకి అబ్దుల్ రషీద్ గా మారారు. ఆమె తల్లి సుప్రసిద్ధ నృత్యకారిణి, గాయకురాలు, నటి, స్వరకర్త మరియు దర్శకురాలు. ఫాతిమా 1935 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ (బేబీ నర్గిస్) గా మారడానికి ఇదే మార్గం సుగమం చేసింది. బాలీవుడ్ నటులు అన్వర్ హుస్సేన్ మరియు అక్తర్ హుస్సేన్ లకు ఆమె సోదరి.

నర్గిస్ మరియు నటుడు రాజ్ కపూర్ జంటగా నటించిన చిత్రాలు అఖండ విజయం సాధించాయి. వీరి off screen romance అందరికీ తెలిసిందే. అప్పటికే వివాహితుడైన రాజ్ కపూర్ తన భార్యకు విడాకులిచ్చి ఈమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. విశ్వవ్తాప్తంగా బహుప్రశంసలు పొందిన 'మదర్ ఇండియా' చిత్రంలొ ఈమె, సునీల్ దత్ తల్లీ కొడుకులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ లో మంటలు సన్నివేశంలో నర్గీస్ ని రక్షించి సునీల్ దత గాయలకు పాలయ్యాడు. అప్పుడు నర్గీస్ సునీల్ దత్ కి శుశ్రూషలు చేసింది. ఈ విధంగా వారి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ అప్పుడు వివాహం చేసుకున్నారు. ప్రఖ్యాత నటుడు సంజయ్ దత్ వీరి కుమారుడే!

ఎన్నో సంవత్సరాల తర్వాత నర్గీస్ 'రాత్ ఔర్ దిన్' చిత్రంలో ఓ విలక్షణమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను అప్పుడే ప్రవేశపెట్టిన తొలి "ఊర్వశి" పురస్కారాన్ని స్వంతం చేసుకుంది. నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' పొందిన తొలి నటి కూడా ఈమే. ఇంకా ఎన్నో పురస్కారాలు ఈమె స్వంతమయ్యాయి.

Pancreatic cancer తో మే 3, 1981 సంవత్సరంలో నర్గీస్ మృతి చెందారు.


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...