14, మే 2021, శుక్రవారం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం


 


అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ప్రస్తుత కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంలో నేను వేసుకున్న చిత్రానికి నా మిత్రులు facebook లో చక్కని పద్య స్పందన ఇచ్చారు.  వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి పద్య రచనలను క్రిందన పొందుపరుస్తున్నాను.


అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మిత్రుల పద్య స్పందన, వారికి నా ధన్యవాదాలు. కరోనా మహమ్మారి నేపధ్యంలో చక్కని పద్యాలు రచించిన కవి మిత్రులకు నా ధన్యవాదాలు.
శ్రీ Purushothamaro Ravela
చంపకమాల:
*************
పవలునురేయిగాదనక ,బాధ్యతలెవ్వియువీడకుండగా
నవనవలాడు నవ్వులను,నాణ్యముగానిటబంచునెప్పుడున్
కువకువలాడు భాషణల,కూటమిగట్టుచు పావురమ్ములై
భువిదిగు దైవదూతలన , భూతలమందున నర్సులేసుమా!
ఉత్పలమాల:
--------------
ప్రాణములెక్కజేయకను,పావులుగానిటసేవజేయుచున్
కోణములెన్నిజూసినను,కోవిదులౌదురు యెందరున్న మీ
దానము ధర్మపున్ గుణము,దాసులుజేయును నెట్టివారలున్
మానముగల్గుభామినులు,మాకడ దేవతలన్న నర్సులే
శ్రీమతి Padmaja Mantrala
ఏ రోగి నీసడింపక
నోరిమితో సేవ సేతురుత్తమ రీతిన్...
తీరున యేమిచ్చుకొనిన?
మీ రుణమది నర్సులార! మీకివె ప్రణతుల్!
(ఈసడించు=అసహ్యించుకొను/కోపించు/నిందించు)
ఆ.వె
చెదరని దర హాస చేమంతులను పంచు
కత్తి పైన సాము వృత్తి తనకు
బ్రదుకు నాస నింపి పరిచర్య గావించు
నాక ముంచు గనుల నర్సు తాను
శ్రీ Venkateswara Prasad
ఆ.వె
చెదరని దర హాస చేమంతులను పంచు
కత్తి పైన సాము వృత్తి తనకు
బ్రదుకు నాస నింపి పరిచర్య గావించు
నాక ముంచు గనుల నర్సు తాను

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...