28, మే 2021, శుక్రవారం

మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాలా - అన్నమయ్య కీర్తన
(నా చిత్రంతో అన్నమయ్య కీర్తన)

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా

సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ

వరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
శిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా

ఈ కీర్తనని శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా పాడారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.

బుచ్చి బాబు (రచయిత)

ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. వీరు రచించిన 'చివరకు మిగిలేది" నవలా సాహిత్యం లో...