4, మే 2021, మంగళవారం

అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది! - తెలుగు గజల్


 అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది!

అమ్మాఅని మొదటిపదం పలికించే ఘనతమనది!
అమ్ముంటే చాలుకదా అమ్మలేని డబ్బువృధా!
పరస్త్రీని తల్లివలే మన్నించే ఘనతమనది!
జగత్తునే కాపాడే మమతున్నది అమ్మలో
అమ్మతనం ఎచటున్నా పూజించే ఘనతమనది !
మాతృభూమి లో అమ్మను చూచుకునే హృదయాలివి
మాతుఝేసలామంటూ నినదించే ఘనతమనది !
అమ్మచేయి పట్టుకునే అడుగులేసి ఎదుగుతాము
గుండెల్లో అమ్మబొమ్మ చిత్రించే ఘనత మనది !
కానీ...... ...... .......
అమ్మకేది ఒక్కసెలవ ! పనిచేసే యంత్రమైంది.
కవితల్లో మాత్రమిలా రచియించే ఘనత మనది.
కడుపుబరువు మోసినట్లు కాడిమోయ గలదు వనిత
అది తెలిసీ వంటింటికి బంధించే ఘనత మనది !
నాగరికుల మంటూనే నారిని అణిచేస్తున్నాం
అమ్మపాత్ర నాటకాన తగ్గించే ఘనత మనది!
బొమ్మలు చెక్కే శిల్పిని శిల్పంగా మార్చేసాం
అమ్మలకై ఒకరోజును ప్రకటించే ఘనతమనది!
~~~~~~~~~~~~
గజల్ సౌజన్యం డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...