23, మే 2021, ఆదివారం

రామ్-లక్షణ్, SP బాలసుబ్రహ్మణ్యం అనుబంధం






 

నిన్న స్వర్గస్తులైన ప్రఖ్యాత సంగీత దర్శకుడు 'రామ్లక్ష్మణ్' కు నా నివాళి. వీరి ఫోటో ప్రక్కన బాలు గారి చిత్రం (నా pencil drawing) ఎందుకని మీరు సందేహించవచ్చు.
ఈ సంగీత దర్శకుని అసలు పేరు 'విజయ్ పాటిల్'. మరొక సంగీత దర్శకుడు సురేంద్ర తో కలిసి 'రామ్-లక్షణ్' అన్న పేరుతో పలు విజయవంతమైన హిందీ, మరాఠీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మన గాన గాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దర్శకత్వంలో హిందీ తెరకి పరిచయమయినా, వీరికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన పాటలు రామ్-లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన Maine Pyar kiya, Ham aap ke hain koun, Hum saath saath చిత్రాలే. ఈ మూడు చిత్రాలు రాజశ్రీ banner పై వచ్చిన చిత్రాలే. ఈ చిత్రాల్లొ Salman Khan కి గొంతు ఇచ్చింది బాలూ గారే. Salman Khan కి బాలు గారి గొంతు అతికినట్లు సరిపోయింది. బారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఈ పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. బాలు గారు జీవించి ఉంటే రామ్-లక్ష్మణ్ మృతి పట్ల చాలా విచారించి ఉండేవారు.


కామెంట్‌లు లేవు:

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...