22, మే 2021, శనివారం

సాహిర్ లూఢియాన్వీ - Sahir Ludhianvi


My pencil art work of Sahir Ludhianvi

సాహిర్ లుధియాన్వీ (1921-1980), సుప్రసిద్ధ ఉర్దూ కవి, ఎన్నో హిందీ సినిమాల గేయరచయిత. ఇతడి పేరు "అబ్దుల్ హయీ", కలంపేరు "సాహిర్", లూధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా 'మాంత్రికుడు' (జాదూ చేసేవాడు), సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలంపేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

బాలీవుడ్ లో తన ప్రస్థానం మొదలెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, ఓ రెండు దశాబ్దాలుగా వెలుగొందాడు. హిట్టయిన ప్రతిచిత్రం ఇతడి రచించిన పాటలు కలిగివుండేది.


  • కభీ కభీ చిత్రంలోని పాట;
"మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై

  • ప్యాసా చిత్రంలోని ఈ పాట అప్పటి ప్రధానమంత్రియైన జవహర్లాల్ నెహ్రూను సైతం కదిలించివేసింది.

"యే కూచే, యె నీలామ్ ఘర్ దిల్‌కషీ కే,
యె లుట్‌తే హువే కారవాఁ జిందగీ కే,
కహాఁ హైఁ, కహాఁ హైఁ ముహాఫిజ్ ఖుదీ కే,
జిన్‌హే నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ,

సాహిర్ వ్రాసిన కొన్ని పాటలు;

  • ఆనా హై తొ ఆ (आना है तो आ) - నయా దౌర్ (1957) - స్వరకల్పన ఓ.పి.నయ్యర్.

  • యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై (ये दुनिया अगर मिल भी जाए तो क्या है) (ప్యాసా -1957), స్వరకల్పన ఎస్.డి.బర్మన్.

  • తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా (तु हिंदु बनेगा ना मुसलमान बनेगा) - ధూల్ కా ఫూల్ (1959), స్వరకల్పన దత్తా నాయక్.

  • యే ఇష్క్ ఇష్క్ హై (ये ईश्क ईश्क है ) - బర్సాత్ కి రాత్ (1960), స్వరకల్పన రోషన్.

  • నాతో కారవాఁకీ తలాష్ హై (ना तो कारवाँ की तलाश है) - బర్సాత్ కీ రాత్ (1960), స్వరకల్పన రోషన్.

  • అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్ (अल्ला तेरो नाम ईश्वर तेरो नाम) - హమ్ దోనో (1961), స్వరకల్పన జయదేవ్.

  • చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో (चलो ईक बार फिर से अजनबी बन जाए हम दोनो ) - గుమ్‌రాహ్ (1963 ) - స్వరకల్పన రవి.

  • మన్ రే తూ కాహే న ధీర్ ధరే (मन रे तु काहे ना धीर धरे?) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.

  • సంసార్ సే భాగే ఫిర్తే హో, భగవాన్ కో తుమ్ క్యా పావో గే (संसारसे भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे) - చిత్రలేఖ (1964) - స్వరకల్పన రోషన్.

  • ఈశ్వర్ అల్లా తేరే నామ్ (ईश्वर अल्ला तेरे नाम) - నయా రాస్తా (1970) - స్వరకల్పన దత్తానాయక్.
  • మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ (मै पल दो पल का शायर हुँ) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.

  • కభీ కభీ (कभी कभी) - కభీ కభీ (1976) - ముహమ్మద్ జహూర్ ఖయ్యాం.

సాహిర్ రచించిన కొన్ని అద్భుతమైన సూపర్ హిట్ పాటలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినొచ్చు .. 


https://www.youtube.com/watch?v=outkSx58IjQ

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...