6, మే 2021, గురువారం

ఆచార్య ఆత్రేయ - శత జయంతి స్మృత్యంజలి. - pencil sketch

 నా రేఖలు గీతల్లో ఆత్రేయ గారి pencil చిత్రం

'మనసు కవి/' ఆచార్య ఆత్రేయ శత జయంతి స్మృత్యంజలి - ఈ సందర్భంగా మిత్రులు డా. ప్రసాద్ కె.వి.యస్ గారు ఈ మహనీయుని గురించి చాలా అద్భుతంగా వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందించిన వివరాలు నలుగురికీ తెలియాలనే సదుద్దేశ్యంతో యథాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.
భగ్న ప్రేమకు భాష్యం చెప్తున్న ఈ కవిత్వం అజరామరం.
ఇలాంటి సజీవ భావుకత ఓ కవి అంతరంగ మథనం తో రావాలంటే....మాటలు కాదు.
అనుభవైక భగ్న ప్రేమ నుండి పుట్టింది కనుకనే.....
అది మన గుండెను తాకి....
ఆత్మను పలకరించి...
అవ్యక్తానుభూతినిస్తుంది.
మంగళం పాడు లోని ఆ సందులో ఉన్న మన్మధ బాణం....వీణ... కటాక్ష వీక్షణాలే.....
ఆత్రేయ కలాన కవితా ఝరి అయి ఈ నాటికీ అలరిస్తున్నాయి!
సూర్య చంద్రులు వెలిగేవరకు..
తారలన్నీ మెరిసే వరకు
జాతి మతాలు సమసే వరకు
జన్మలన్నీ ముగిసేవరకు....
కలిసి ఉందామనుకున్న ఆత్రేయ -వీణ ల జంట కు...
కులమూ కులమూ...జాతి జాతి అని గాండ్రించిందా పెద్దతనం...
గుణమే కులమని...నీతే జాతని వాదించిందా యువతరం.
పెద్దరికమే నిలిచి గెలిచింది.
వలపు వాకిట్లోనే నిలిచింది
గడప దాటి ఇంట దీపించనే లేదది.
**********
తమల పాకు పాదాలైనా తాండవ నృత్యం చేయుటలేదా!
పిడికెడు గుండె మనిషికి ఉన్నా కడివెడు ప్రేమను మోయుట లేదా!
కళ్ళకు కాటుక హద్దవుతుందా! కమ్మని కలలను వద్దంటుందా!
తెల్లవారికది మిగిలుంటుందా! వెచ్చని ఎండకు వెన్నెల ఆగుతుందా!
చంద్రుడు కనబడ లేదని వెన్నెల వేరే చోటుకు వెళుతుందా!
మధుపం లేదని మందారం తన మధువును కందిరీగకు అందిస్తుందా!
కట్టుకున్న మేన కోడలు.....పద్మావతి కి న్యాయం చేయలేని జ్వలనం.....ఆయన హృదయం.
ఆ హృదయార్తి లోనుండే అమృత గుళికల్లాంటి పాటల నిధి తెలుగు వారి పెన్నిధిగా మిగిలింది.
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ.
ఆద్యంతాలు లేని ప్రేమ కు నిర్వచనం.
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ
నే తనదాననూ
తనదాననూ.
ఓ ప్రణయిని విరహపు నిట్టూర్పులు.
గాలిలోనా తేలిపోయే
చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం
ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరుగు బ్రతుకుల
నేతగాళ్ళే నేసినారు
చారిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక
తెలుసుకో.
సామాజిక అంతరాల ధిక్కార స్వరం.
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు

తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ.
మాయా మేయమైన దేహికి తప్పని తియ్యని వలపు విలాపం!
*********
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహా చార్యులు.
కృష్ణమాచార్యులు & సీతమ్మలకు.... శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా లోని సూళ్ళూరు పేట మండలంలోని...మంగళం పాడులో 7 మే 1921 లో జన్మించారు.....
ఆచార్య ఆత్రేయ గా పేరొందిన ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసిం హా చార్యులు.
హై స్కూల్ లో చదువుతున్నప్పుడే.....దేవుళ్ళదంతా అన్యాయమే....అని ఓ కవిత వ్రాశాడు.
దేవుళ్ళే న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఎందుకిలా ఉంటుంది? అని నిగ్గదీశాడు పసి వయసులోనే.
8 ఏళ్ళ వయస్సు లోనే.. తల్లి స్వర్గస్తులవడంతో...పెరిగింది మేనమామ జగన్నాథాచార్యుల వారింట.
తండ్రికి...మేనమామ కు...ఇద్దరికీ నాటికలు...నాటకాలంటే మక్కువే. ఆ చర్చలు...చిన్నారి ఆత్రేయను ప్రభావితం చేశాయి.
ఇంటర్ కాగానే....నెల్లూరు లోని కోర్టు గుమస్తా గా చేరి పోయాడాయన. ఆ అనుభవ సారమే.....ఎన్.జి.ఓ.....నాటకం.
ఇంకా...భయం, కప్పలు, ఈ నాడు, పరివర్తన, గౌతమ బుధ్ధ, విశ్వశాంతి & సామ్రాట్ అశోక......గొప్ప నాటకాలు వ్రాశారు.
అనుక్షణం మరణ భయం,
జీవన సమ్రంభణ భయం,
మనిషికి మనిషన్న భయం,
మనసంటే మనసుకే భయం,
సత్యమన్నచో సచ్చే భయం,
చచ్చుదాకా చావు భయం.
భయం....నాటకం కోసం వ్రాసుకున్న ఈ పాట....ఇప్పటి కరోనా పరిస్థితి కి అద్దం పడుతోంది!
*********
దేశ విభజన టైం లో ....ఈ నాడు....అనే మత సామరస్యం ప్రభోధించే నాటకం వ్రాసి...1948 జనవరి 30 న నెల్లూరు లో ప్రదర్శిస్తున్న నాటకంలో....
ఓ హిందూ పాత్ర....ముస్లిం స్నేహితుడికి గాంధీ బొమ్మ ఒకటి బహుమతి ఇస్తాడు....స్వతంత్రం వచ్చిన సంబరంలో.
ఆ నాటకం చివరలో ఓ మతోన్మాది విసిరే కత్తి తగిలి గాంధీ విగ్రహం ముక్కలవుతుంది.
సరిగ్గా అదే రోజు గాంధీ మహాత్ముని పై అలాగే దాడి జరిగి మరణించడం ....
ఆత్రేయ ను మానసికంగా కృంగ తీసింది.
గౌతమ బుధ్ధ...పరివర్తన....నాటకాలు వేస్తున్న కాలంలోనే.....గుడివాడలో అక్కినేని &, దుక్కిపాటి మధుసూధన రావు ల పరిచయం.
కె.ఎస్.ప్రకాశరావు గారు పట్టు పట్టి తన మూవీ దీక్ష(1950) కోసం...మొట్ట మొదటి పాట వ్రాయించుకున్నాడు.
అదే....పోరా బాబు పో...పోయి చూడు లోకం పోకడ.....అనే పాట.
అలా సినీ రంగాన కాలూనిన ఆత్రేయ కు.....సినీరంగం ఇరుకు మనస్తత్వాలు.... కరకుగా తోచింది.
కల్పిత మబ్బులకు....నెమలి నాట్యమాడటం ఎలాంటిదో....సినీ వాతావరణంలో కవిత్వం వ్రాయడం కూడా అంతే అనేవారాయన!
అందుకే.....ఆత్రేయ వ్రాయడానికి....చాలా కాలం తీసుకునేవారు.
వ్రాయకుండా నిర్మాతలను....వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు ఆత్రేయ అనే అపప్రధను మోస్తూ.....
వ్రాయడానికి ఇక్కడ నేనెంత ఏడిస్తానో...ఎవరికీ తెలియదు మరి అని చమత్కరించేవారు!
***********
ఇక సినీరంగాన....దాదాపు ఆత్రేయ తోనే రంగ ప్రవేశం చేసిన ....కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, శ్రీ.శ్రీ, మాల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి వారే కాక...
అప్పటికే ఉన్న మహా కవులు....పింగళి, సముద్రాల సీనియర్ & జూనియర్లు....ఎంత మంది ఉన్నారో!
ఇక చిత్ర జగత్తులో....భగ్న కవికి....మనశ్శాంతికి మార్గం.....మదిర.....ఇంకా మగువ.
అందుకే ప్రేమ నగర్ లో డైలాగులు.....అంత గొప్పగా కుదిరాయి!
ఏం తీశాడురా.....ఏం చేశాడురా...అనే వారు ....క్రొత్తగా ఏం వ్రాశాడురా ఆత్రేయ.....అన్నారు మొట్ట మొదటి సారిగా!
మదిర అలవాటు లేని వారు చిత్రసీమలో అరుదు.
ఇక మగువలూ మామూలే.....నిజం చెప్పాలంటే!
వారిలో....ఆత్రేయ మనస్సును గేలం వేసి పట్టుకున్నది....కమల.....నల్ల కలువల్లే మెరిసి పోయేదట.
ముగ్గురు స్త్రీమూర్తులు.....ఆత్రేయ జీవితాన్ని నిర్దేశించారు.
అందని ప్రేయసి వీణ.......
కట్టుకున్న అనాఘ్రాత భార్య పద్మావతి......
పొందులో స్వర్గం చూపుతున్న కమల.....
ఆత్రేయ ఏం వ్రాసినా.......వీరి ముగ్గురి ప్రభావమే!
ఈ వీణకు శృతి లేదు....ఎందరికో హృదయం లేదు....
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే....
పాడుతా తియ్యగా చల్లగా...
నా పాట నీనోట పలకాల చిలకా....
ప్రేమ లేదని...ప్రేమించరాదని...
ఎదుట నీవె ఎదలోనా నీవే....
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...
విధి చేయు వింతలన్ని మతి లేని చేతలేనని..
మౌనమె నీభాష ఓ మూగ మనసా!....
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు!
మనసు లేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం...
మనదొక మధు కలశం..పగిలే వరకే అది నిత్య సుందరం....
నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని...
నీ సుఖమే నే కోరుతున్నా...నిను వీడి అందుకే వెళుతున్నా...
పదహారేళ్ళకు...నీలో నాలో ఆప్రాయం చేసే చిలిపి పనులకు...
*********
చందమామ మోము ....
చారెడేసి కళ్ళు...
దొండపండు పెదవి...
పండునిమ్మ పసిమి....
కడలి అలల కురులు....
కానరాని నడుము....
కన్నె సొగసులని .....
కవులన్నారు....
అవి ...అన్నో...కొన్నో ...
ఉన్న దానను...
అలతి పదాలతో అలవోకగా అలా అలా....చదివితే గద్యం.
పాడితే....చోద్యం! మనోహరం! అద్భుతం!
నిలిచిపోయే....కావ్యం!
కఠిన సమాస భూయిష్టమైన పదాలుండవు.అక్కడే ఆయన విశిష్టత! ప్రజల నోళ్ళలో ఈజీగా నానుతుంది. పాట సూపర్ హిట్ అవుతుంది. అది ఒక్క ఆయనకే చెల్లు!
నీలోని మగసిరి తోటి...
నాలోని సొగసుల పోటి...
వేయించి..నేనే ఓడి పోనీ పొమ్మంటి!
నేనోడి...నీవే గెలిచి....
నీ గెలుపు నాదని తలచి...
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి!
శృంగారానికి పరాకాష్ట ఈ చరణాలు.
అర్థం చేసుకుంటే...మనోల్లాసమే!
ప్రాసల తో మామూలుగా ఆడుకునేది ఆరుద్ర గారు.
కానీ ఈ గీతంలో వీరి శృంగార చమత్కారం....ప్రాసలతోనే....శిఖరాగ్రాన్ని అంటింది!
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు...
పాటలు పాడిన.....చిరుగాలులకు...
తెరచాటొసగిన...చెలులు శిలలకు...
దీవెన జల్లులు చల్లిన అలలకూ....
కోటి దండాలు....శతకోటి దండాలూ...
పదహారేళ్ళ పరువానికి...పరుగులు తీసే యవ్వనానికి...మెరుగులు...ఇంతకంటే ఎవరు దిద్దగలరు!
చీకటి గుహ నీవు...చింతల చెలి నీవు,
నాటకరంగానివే మనసా...తెగిన పతంగానివే....
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
ఎందుకు రగిలేవో...ఏమై మిగిలేవో...
మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు...
కల్లలు కాగానె...కన్నీరౌతావు...
సగటు మనిషి మనసుకు అద్దం పట్టిన ఈ గీతం ఎవరైనా మరువగలరా!
అందుకే అజరామరంగా నిలిచిందీ పాట.
**********
అన్నీ అందరికీ చేత కావు. ఆయన నిర్మాతగా...దర్శకునిగా...తీసిన ఒకే మూవీ వాగ్ధానం
పెద్దగా ఆడలేదనే చెప్పాలి.
ఘన విజయం మాత్రం కాదు!
పాటలన్నీ హిట్. పాటల రచయితగా...దాశరధిని మొట్టమొదట పరిచయం చేశారు.
నిర్మాత లకు....దర్శకులకు.....ఆత్రేయ....ప్రసూతి వైరాగ్యం రుచి చూపించేవారు!
ఆయనతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెట్టేవాడు. అతను ఆత్రేయ గారి ఇంటనే కారు షెడ్డు లోనో...ఔట్ హౌస్ లోనో ఉంటూఉండేవాడు రేయింబవళ్ళు...పాట కోసం.
ఓ అర్ధరాత్రి సడన్ గా పాట తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ చేతిలో పెట్తే...తెగ సంతోష పడి పోతున్న అతని ఉత్సాహానికి అడ్డు కట్ట వేసేవాడు!
ఆ పాట ఫలానా దర్శకుడిది. దాన్ని అర్జెంటుగా అతనికి డెలివరీ చేసేయ్. నీ పాట రేపో...ఎల్లుండో వ్రాస్తాలే అనేవారట!
ఈ బాధలన్నీ పడలేక...ఇక జన్మలో ఆత్రేయ తో పాటలు వ్రాయించుకోకూడదని నిర్మాత - దర్శకులు అనుకునేంతగా విదిగించేస్తారు!
కానీ ఒకసారి ఆ పాటలు...సినిమా....విడుదలయ్యాక....ఆ రెస్పాన్స్ చూసి....మళ్ళీ మామూలే. మళ్ళీ ఆత్రేయ వెంటే పడేవారు! ఇదేగా ప్రసూతి వైరాగ్యమంటే!
***********
షుమారు 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
పాటలన్నీ భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను....
మనసు కవి - మన సుకవి గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు.
ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునే వారు.
మరో వందేళ్ళు కాదు...వెయ్యేళ్ళైనా....ఆత్రేయ మన గుండెల్లో నిలిచిపోయేట్లు...
అజరామరమైన సినీ గీతాలను పూయించి....1989 - సెప్టంబర్ - 13 న అనంతంలో ఐక్యమయ్యారు మనసు కవి.....మన సుకవి......ఆత్రేయ గారు.
ఒకే ఒక్క నంది అవార్డ్ & అంబేద్కర్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ మాత్రమే పురస్కారాలు వారికి!
అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.
ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, కదంబాలు... మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళి సమర్పించారు.
మే - 7 న ఆత్రేయ గారి శత జయంతి.
నిత్య పరిమళం వెదజల్లే గీతాలను వెలయించిన మన మనసు కవి ఆత్రేయ వారికి....
శత జయంతి స్మృత్యంజలి.

(ప్రసాద్ కె.వి.యస్)

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...