19, మే 2021, బుధవారం

నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!


 


మిత్రులు శ్రీ Suresh Ganti గారి గజల్ కి నా చిత్రం. అనుమతించిన సురేష్ గారికి ధన్యవాదాలు..


మనసిచ్చిన నెచ్చెలివని మనసు నీకె ఇచ్చాను
నీ ముసి ముసి నవ్వులు ఒలికే ముద్దు మోమె చాలులె!

నీ వలపన్నదె గెలుపని నే పోరాటమె చేస్తున్నా
నీ నులి సిగ్గుల మొగ్గలైన ఆ ముద్దు మోమె చాలులె!

కనురెప్పలె ప్రమిదలుగ ప్రేమ జ్యోతులు వెలిగించాను
నీ చిరునవ్వులు చిందించెడి ఆ ముద్దు మోమె చాలులె!

నా తలపులు నా వలపులు నీవేనని చెపుతున్నా!
మెరిసెడి కన్నుల నవ్వెడి నీ ముద్దు మోమె చాలులె!

ఈ జన్మకు ప్రతి జన్మకు నా ప్రేయసివిక నీవన్నా!
నీ అరచేతిలొ దాచుకున్న ఆ ముద్దు మోమె చాలులె!

నా తనువూ, మనసూ నీకై తహతహ మని అంటున్నా!
నీ ఎరుపెక్కిన బుగ్గలసిరి ముద్దు మోమె చాలులె!

నా కలలో, ఇలలో నీకై , కలవరపడి చూస్తున్నా!
మనసున మరులను రేపే నీ ముద్దు మోమె చాలులె!

రచన ~ సురేష్ గంటి. 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...