2, మే 2021, ఆదివారం

పుస్తక పఠనం

 



మరుగునపడ్డ ఓ అలనాటి బాపు గారి నలుపు తెలుపుల రేఖా చిత్రాన్ని, నేను నా రేఖలు రంగుల్లో మళ్ళీ చిత్రీకరించాను. నా సేకరణలో శిధిలావస్థలో ఉన్న బాపు గారి కొన్ని చిత్రాల్ని పునరుధ్ధరించాలనే నా తపన కి మిత్రుల సహకారం, స్పందన నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.


ఈ చిత్రానికి facebook లో వచ్చిన పద్య స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.


శ్రీమతి పద్మజ మంత్రాల గారి పద్యం

కందము

తీరైన వంపు సొంపులు

బారెడు జడ గలిగినట్టి భామ సొగసుగా...
చేరిచి చెంపకు కరమును
బోరగిలి పఠించుచుండె పొత్తము నౌరా!
(పొత్తము=పుస్తకము

-------------------------------------------------------------------------------------------

శ్రీ వేంకటేశ్వర రావు గారు రచించిన పద్యం:

ఆటవెలది -

చదువు కొనిన యువతి సంస్కారి యౌచును
చక్కదీర్చు నిల్లు నిక్కముగను
విలువ నెరిగి నిత్య విదార్ధి యై తాను
చదివి చదువు జెప్పు సంతతి కిని

-- సేకరణ : పొన్నాడ మూర్తి


కామెంట్‌లు లేవు:

మా తరం కా లేజీ అమ్మాయి

 సీ. వాలుజడ నొకింత వదులుగాఁ నల్లియు      సన్నజాజుల మాల జడను దాల్చి ఒంటిపేట గొలుసు నొద్దికఁ నమరించి       దిద్దియున్ తిలకంబుఁ దీరు గాను శ్రోత...