30, మార్చి 2016, బుధవారం

మీనాకుమారి - పెన్సిల్ చిత్రం - Meena Kumari - Pencil drawing

ఈ రోజు మహా నటి, ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి వర్ధంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా ఆ మహానటికి నా నివాళి అర్పిస్తున్నాను.  ఈ సందర్భంగా www.palapitta.net లో శ్రీ వంశీకృష్ట్న గారి వ్యాసాన్ని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రింద పొందుపరుస్తున్నాను.

మీనా కుమారి…
ఈ పేరు వినగానే ఎవరికయినా పాకీజా, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌, బైజు బావ్‌రా లాంటి హిందీ క్లాసిక్‌ సినిమాలు గుర్తుకొస్తాయి. కాని నాకు మాత్రం ఒక అందమైన తాజ్‌మహల్‌ గుర్తుకొస్తుంది.
తాజ్‌మహల్‌ను డాక్టర్‌ సి.నారాయణరెడ్డి గారు ‘కాలం చెక్కిట కన్నీటి చుక్క’ అని అభివర్ణించారు.
మీనా కుమారి కూడా తాజ్‌మహల్‌లాగే అందమయినది.
తాజ్‌ మహల్‌ కూడా మీనాకుమారిలాగే అద్భుతమయినది.
తాజ్‌మహల్‌ విషాద సౌందర్య బీభత్సానికి ఎలా ప్రతీకో మీనా కుమారి కూడా జీవన విషాద గాద్గదిక్యానికి ఒక సంకేతం.
‘మహజ బీన్‌ బనో’ మీనాకుమారి అసు పేరు. తల్లిదండ్రుల బవంతం మీద పదేళ్ళ వయసులోనే ముఖానికి రంగు వేసుకుంది. అందరు పిల్లల్లాగే  స్కూల్ కి వెళ్ళి  చదువుకోవాలి అన్నది మీనా కుమారి లోలోపలి కోరిక. కానీ తన ఇష్టానికి విరుద్ధంగా సినిమాలోకి రావసి వచ్చింది. జీవితం మొట్టమొదటిసారి మీనా కుమారిని కొట్టిన కమ్చీ దెబ్బ అది. జీవితం మీనాకుమారిని అలా దగా చేసినా సమాజానికి మాత్రం గొప్ప మేలునే చేసింది. ఒక అపురూపమయిన, అద్భుతమయిన నటిని భారతీయ సమాజం సొంతం చేసుకోగలిగింది.
మొత్తం 90కి పైగా సినిమాలో నటించిన మీనా కుమారి హిందీ సినిమా స్వర్ణ యుగానికి అగణితమయిన కాంట్రిబ్యూషన్‌ అందించింది.
పాకీజా, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌, బైజు బావ్‌రా, బహూ బేగమ్‌, ఫూల్‌ ఔర్‌ పత్తర్‌, దిల్‌ అప్‌నా ఔర్‌ ప్రీత్‌ పరాయీ, దిల్‌ ఏక్‌ మందిర్‌, పరిణీత ఇలా చెప్పుకుంటూ పోతే తను నటించిన సినిమాలు అన్నింటినీ ఉదహరించవసిందే.
భర్త ప్రేమ కోసం తనను తాను కొవ్వొత్తిలాగా కరిగించుకున్న చిన్న కోడలిని (సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌)ను ఎవరు మాత్రం మరచి పోగరు? జ్ఞాపకానికీ, వాస్తవానికీ మధ్య ప్రేమకీ కోపానికీ మధ్య ఊయలూగుతూ, తనను తాను మర్చిపోయిన ‘మిస్‌ మేరీ’ని ఎవరు మాత్రం హృదయంలో నుండి నిర్దాక్షిణ్యంగా బయటకు తోసి వేయలగరు? తను మార్కెట్‌లో సరుకయినా సరే, తనను కొనుక్కునే హైయ్యెస్ట్‌ బిడ్డర్‌ ఎవరు అవుతారా? అని ఎదురు చూస్తూ కలను కన్నీటి అలలుగా మార్చుకున్న ‘వేశ్య’ (పాకీజా)తో ఎవరు మాత్రం మనసులో నుండి బయటకు పంపించగరు?
తన మొట్టమొదటి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును ‘బైజు బావ్‌రా’ సినిమాకు అందుకున్న మీనాకుమారి ఫిలిమ్‌ అవార్డులో ఒక అరుదయిన ఫీట్‌ను సాధించింది. 1962లో తను నటించిన మూడు సినిమాలు ‘ఆర్తి, మైనే చుప్‌ రహూంగి, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ లో ఉత్తమ నటి విభాగంలో పోటీ పడ్డాయి. ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’లో ఆమె నటనకి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు వరించింది.
కమల్‌ అమ్రోహితో మీనా కుమారి ప్రేమ, పరిణయం, విడిపోవడం జీవితం ఆవిడని కొట్టిన రెండవ కమ్చీ దెబ్బ. రెండు బలమయిన వ్యక్తిత్వా మధ్య ఘర్షణ అది.
14 సంవత్సరాల పాటు ‘పాకీజా’ సినిమాతో తన ప్రయాణం జీవితం కంటే విచిత్రమయినది.
కళ జీవితాన్ని, జీవితం కళనూ అనుకరిస్తాయి. రెండూ పరస్పర పూరకాలు అనడానికి మీనాకుమారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. తన జీవితంలో ప్రేమ కోసం పరితపించినట్లుగానే తన సినిమాలో కూడా ప్రేమ కోసం ఆమె అన్వేషించింది. తన సినిమాలో మాదక ద్రవ్యాలకి అలవాటు పడినట్టుగానే తన జీవితంలోనూ మాదకద్రవ్యాలకి అలవాటు పడిపోయింది. ఫ్లడ్‌లైట్ల వెలుగు నీడల మధ్యన, అదృష్టం, దురదృష్టం దోబూచులు ఆడినట్లుగానే, ప్రేమ, పరాభవాల మధ్య ఆవిడ జీవితం ఊయలూగింది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే ‘మీనా కుమారి’ మంచి కవయిత్రి. గొప్ప దు:ఖం కలిగినా, చెప్పలేనంత ఆనందం కలి గినా ఆవిడ అక్షరాల మధ్యన తనను తాను సాంత్వన పర్చుకునేది. అక్షరాలు తమ విశాలమయిన బాహువులలో ఆమెను పొదివి పట్టుకుని ఓదార్చేవి. ఆవిడ మరణానంతరం ఉర్దూలో ఆవిడ రాసిన కవితన్నింటినీ నూరుర్‌ హసన్‌ ఇంగ్లీషులోకి అనువదించి ‘మీనాకుమారి.ది.పొయెట్‌ ‘ఎ లైఫ్‌ బియాండ్‌ సినిమా’ పేరుతో ప్రచురించాడు.
తన కవిత నిండా దు:ఖం, పోగొట్టుకున్న భావన, తనకు తానే పరాయీకరణ చెందిన అనుభవమూ, ఒంటరితనం ముప్పిరిగొని ఉంటాయి. మృత్యువు అంటే భయం కాదు కానీ, అది అందించే శాంతి పట్ల ప్రేమ తన కవితలో బలంగా వ్యక్తమవుతుంది. జీవితం నుండి పక్కకు జరుగుతూ, కలిసిపోతూ తను చేసిన ప్రయాణం, పొందిన ఉద్విగ్నత, తన అక్షరాలో అక్షరాలా కనిపిస్తాయి.
‘‘జిందగీ యేహై’’ అనే కవిత చూడండి.
‘‘ఉదయాస్తమయాల మధ్య
ఇతరు కోసం మనం ఎన్నో చేస్తాము
ఆ జీవన దృశ్యం అద్భుతంగా ఉంటుంది.
కానీ ఆ దృశ్యంలో మన ఆత్మ వికసించదు…
జీవితం ఏమిటని హృదయం
పదే పదే ప్రశ్నిస్తుంది?
దు:ఖాగ్ని నీడ వెనుక ఆత్మ కనుమరుగవుతుంది.
నిరాశామయ ధూమ వలుయాలు
బాధా మేఘాలు జీవితం అయితే
నా హృదయం అవిశ్రాంతంగా పరితపిస్తుంది
మరణం అంటే ఏమిటని?
ప్రేమ ఒక కల
దాని భవిష్యత్‌ చిత్రపటం గురించి అడగకు
ప్రేమకు విశ్వసనీయంగా ఉన్నందుకు
నేను పొందిన శిక్ష గురించీ అడగకు’’
మీనా కుమారి కేవలం  కవిత్వం మాత్రమే రాసి వుంటే ఎంత గొప్ప పేరు వచ్చి ఉండేదో కదా! దు:ఖాగ్ని నీడ వెనుక అన్న పదబంధం ఏ చేయి తిరిగిన కవి కల్పనకీ తీసిపోదు.
తన ‘‘ఖాళీ దుకాన్‌’’ అనే కవిత చూడండి.
‘‘కామెందుకిaలా ఇన్నిన్ని వస్తువును
నా హృదయపు వాకిలి ముందు పరిచింది?
ఇందులో నేను కొనగ వస్తువులేవి?
కీర్తి కాంక్ష కాయితం పూలు
సంతోషాన్నిచ్చే జీవంలేని బొమ్మలు
అద్దాల బీరువాలో అందంగా బంధించిన
సంపద అనే కొవ్వొత్తి గుళికలు
కాలం ఇన్నిన్ని వస్తువులను
నా హృదయపు వాకిలి ముందు పరిచింది ఎందుకు?
ఇవి కాదు నేను కోరుకున్నది.
దహించుకుపోయే నయనాలను
సాంత్వన పర్చగ ఒక అందమయిన కలలాంటి ప్రేమ
నాకు కావాలి.
అశాంతితో వివిల్లాడిపోయే ఆత్మను
సాంత్వన పర్చగల ఒక అద్భుతమయిన సాన్నిహిత్యం
నాకు కావాలి.
కాలమనే ఈ ఖాళీ దుకాణం
ఇవేవే నాకు అందించదు.
జీవితం సప్తవర్ణ సంశోభితం అనుకుంటాం కానీ… అది అందరికీ కాదు. మీనాకుమారి పదే పదే చెప్తోంది. కాలం  అనే ఖాళీ దుకాణంలో అందరికీ అన్నీ దొరుకుతాయి. కానీ ఎవరికి కావలసింది వారికి దొరకదు. విరోధాభాస అంటే ఇదేనేమో!
మన సావిత్రిలాగే మత్తుకి బానిసయి 40 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మీనాకుమారి మనని వీడిపోయింది.
మానవ వేదన, చిరంజీవి.
మీనాకుమారి చిరంజీవి.
సినారె చెప్పిన తాజ్‌మహల్‌లాగే మీనాకుమారి
‘‘కాలం చెక్కిట కన్నీటి చుక్క’’.



29, మార్చి 2016, మంగళవారం

నా విరహపు పూదోటలో పూబంతివి నీవేగా - తెలుగు గజల్ - నా పెన్సిల్ చిత్రం.


నా విరహపు పూదోటలో పూబంతివి నీవేగా
నా తలపుల మైమరపుల సీమంతివి నీవేగా

మూసివున్న కన్నులతో నీ ఊహలో నేనుంటే
కౌగిలిలో హత్తుకున్న చేమంతివి నీవేగా

ఏకాంతపు నాకలలకు ఊపిరులే పోస్తుంటే
ప్రేమలతో పరవశింపు కలహంసివి నీవేగా

మిన్నంటే నీప్రేమే ఆలంబన అవుతుంటే
నామదిలో కొలువుండే లలితాంగివి నీవేగా

తొలిచూపులో మదిచేరిన నీకోసమే పలవరింత
మధుర’వాణి’ వినిపించే కలకంఠివి నీవేగా

(వాణీ వెంకట్ గారి గజల్ – గజల్ సుమాలు పుస్తకం నుండి సేకరణ

Sketch : Ponnada Murty, Image creation : Rani Reddy)

28, మార్చి 2016, సోమవారం

బాహుబలి - కంచె - జాతీయ పురస్కారాలు





2015 సం.కు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయిన చిత్రం 'బాహుబలి'.
అదే రీతిలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపిక అయ్యింది. ఈ రెండు చిత్రాలు చూసే భాగ్యం నాకు కలిగింది. ఇది తెలుగు ప్రజల విజయం. ఈ చిత్రాలు నిర్మించిన నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక అభినందనలు.

బాహుబలి - కంచె - జాతీయ చలనచిత్ర పురస్కారాలు

రాజమౌళిగారు యు ఆర్ అమేజింగండి. Successful people do
simple things differently and you are one of them,
Congratulations for your success. We knew you'd excel. You always do!!
Your road was rough, but you did an excellent job.
Success is always measured by hard work, discipline and will to win.
I wish all the success on your next endeavor! All The Best!!
రాజమౌళిగారి బాహుబలి "టీమ్" లోనున్న అతిరధమహారధులందరికీ శుభాభినందనలు.
సినీచరిత్రలో అత్యంత అధ్బుతంగా నిలిచిన మాయాబజార్, మొగల్ ఇ ఆజమ్ సరసన మళ్ళీ ఇన్నేళ్ళకి మన తెలుగు సినిమాని జతచేయగలగడం వెనుక రాజమౌళిగారి కుటుంబసభ్యులతో కలిసిపోయి అహర్నిశలూ కష్టపడి పనిచేసిన మీ అందరి గురించీ వింటున్నప్పుడు, బిహైండ్ ద సీన్స్ రషెస్ చూస్తున్నప్పుడు ఎంతో ఉద్వేగం మాకు కూడ.
మంచి చిత్రం తీసారు. ఫేంటసీ, గ్రాఫిక్స్ తో కూడినదైనా...కధవినడం, చూడడం ఇష్టం మనకి.
అమ్మచెప్పే రాజకుమారుడి కధ వింటూ పరవశించేవి పసి మనసులు మనవి.
అద్భుతాలకి పులకరించే పిల్లవాళ్ళ మనసెరిగి విజయేంద్రగారు రాసిన ఫేంటసీ కధని తెరమీదకెక్కించిన విధానం అత్యంత శ్లేఘనీయము.
కధలు వినడానికి ..వయసుకీ సంబంధము లేదు కదా..
సనాతనులకి కూడ కృష్ణలీలలు, కిష్కిందా కాండ తెగ ఇష్టమేగా.
భలే చక్కని చిత్రం తీసిన మీ అందరికీ ధన్యవాదాలు..హార్దిక శుభాకాంక్షలు మరొక్కసారి!!
ఉత్తమ రీజనల్ పిక్చర్ బృందం కృిష్ జాగర్లమూడి గారికి వారి టీమ్కీ శుభాభినందనలతో!!
దేవకి యగళ్ల కాలిఫోర్నియా నుండి.
Credit: Dr chowdari Jampakagaru.
Credit: Dr V Chowdary Jampala

విరాట్ కొహ్లి - క్రికెటర్ - పెన్సిల్ చిత్రం





నిన్న జరిగిన ఇండియా vs. ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో విశ్వరూపం చూపించిి ఇండియాను సెమీ ఫైనల్ కి తీసుకువచ్చిన విరాట్ కొహ్లి పెన్సిల్ చిత్రం. నా ఈ పెన్సిల్ చిత్రానికి తన పద్యాలు ద్వారా చక్కటి పద్యాలు రాసిన శ్రీమతి శశికళ ఓలేటి గారికి ధన్యవాదాలు.

Virat Kohli rocks.with . Pvr Murty

శశికళ ఓలేటి గారు రచించిన పద్యాలు 

ఆ.వె
విశ్వ రూప మదియె వికెటు కడ విరాటు
కోహ్లి , శత్రు పక్ష కుక్షి కొట్ట.
ఫోరు, సిక్సు లంటు ఫోర్సుగా కొట్టుచూ
జయము గూర్చె దేశ జట్టు కతడు.
…………………………………………
ఆ.వె
ఉడుకు రక్తమదియె దుడుకు పరుగులవె
యువత కతడి యాట యుత్సవంబె
భావి నాయకునిగ బ్యాటును ఝళి పించి
కన్నె మనసు దోచు వన్నెకాడు.


……………………………………………

27, మార్చి 2016, ఆదివారం

ఎన్టీఆర్ - సమాజ సేవ






ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాకముందు నుంచీ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా సినీరంగాన్ని ఏకం చేసి సహాయకార్యక్రమాలు చేపట్టేవారు. 1977లో దివిసీమ ఉప్పెన సంభవించి దాదాపు 20 వేల మంది చనిపోయారు. వేల కొద్దీ ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో సినీ రంగమంతా కదలివచ్చి ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంది. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఎన్టీఆర్, విడిగా కూడా వ్యక్తిగతంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యక్తిగత విరాళాలు అందించారు.
ఈ ఫోటోలో కెమెరా వైపు చూస్తున్న వ్యక్తి స్వామి ప్రథమానందజీ. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం నిర్ణయం మేరకు 11 గ్రామాలలోని తుఫాను బాదితులలో నిరుపేదలకు 1100 ఇళ్ళను కట్టించే పనిని ఆయన చేపట్టారు. ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి ఎన్టీఆర్ అన్నివిధాలా సహకారం అందించడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారని స్వామి ప్రథమానందజీ చాలా చోట్ల ప్రస్థావించారు. అలా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఎన్టీఆర్ సందర్శించినప్పటి ఫోటో ఇది.
'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం' అన్న ఎన్టీఆర్ ఆచరణ వాక్యం రాజకీయాల కోసం పుట్టింది కాదు, స్వతహాగా ఎన్టీఆర్ తన జీవితంలో మొదటి నుంచీ ఆచరించి చూపిన మనో సిద్ధాంతం అది.
 (Courtesy : Post by Sri Chandrasekhar Kilari in Facebook)

26, మార్చి 2016, శనివారం

పెన్సిల్ చిత్రం


కనులు మూసిన క్షణం - పెన్సిల్ చిత్రం


కనులు  మూసిన క్షణం కనులముందు అందమైన స్వప్నం
కనులు తెరిచిన క్షణం కనులముందు అర్థం కాని నిజం..

స్వప్నం ఒక ఆశైతే
సత్యం ఒక నిజం...
స్వప్నానికి సత్యానికి నడుమ నలిగిపోతూ రగిలిపోతున్న మనసులోని వ్యధ అనుభవించే వారికి మాత్రమె అర్థం అవుతుంది..

Courtesy : Smt. Shanti Nibha blog.
http://shantirao.blogspot.in/2016/01/vs-swapnam-vs-satyam-in-between-pain.html

తుమ్మల సీతారామమూర్తి





కీ.శే. తుమ్మల సీతారామ మూర్తి చౌదరి గారు - అలనాటి ఆంధ్రపత్రికలో స్వర్గీయ బాపు గారు వేసిన బొమ్మ. ఈ మహామనీషి గురించి వికీపీడియ వారు ఏమంటున్నారో ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకుందాం.
https://te.wikipedia.org/wiki/తుమ్మల_సీతారామమూర్తి

24, మార్చి 2016, గురువారం

కృష్ణసదన్ వృద్ధాశ్రమం - హైదరాబాద్

కృష్ణసదన్ వృద్ధాశ్రమం - హైదరాబాద్
తరచుగా మేము సందర్శించే ఈ వృద్ధశ్రమం అద్భుత సేవలు కొనియాడవలసినదే. మేము మా కుటుంబంతో ఈ వృధ్ధాశ్రమాన్ని పలుమార్లు సందర్శించాము. ఫోటోలు కూడా facebook లో పెట్ట్టాము. ఈ ఆశ్రమంలో ఉంటున్న వారితో కలసి భోజనం కూడా చేసే అదృష్టం మాకు కలిగింది. కుటుంబాన్ని వదలి ఇక్కడ చేరినవారిని తిరిగి తమ కుటుంబసభ్యులే గౌరవంగా తీసుకువెళ్ళడం ఈ వృధ్ధాశ్రమం ప్రత్యేకత. ఈ విషయంలో Deccan Chronicle దినపత్రిక వారు నిన్నటి తమ పత్రికలో ఈ ఆశ్రమం గురించి వ్రాసిన వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.

23, మార్చి 2016, బుధవారం

పెన్సిల్ చిత్రం - (ఊహా చిత్రం)


దామోదరం సంజీవయ్య


ఇది అలనాటి ఆంధ్రపత్రిక లో వచ్చిన వ్యాసం. బొమ్మ బాపు గారు వేసారు.

మనసుని మీటే రాగం నీవే - తెలుగు గజల్

RVSS Srinivas గారి గజల్ కి నా బొమ్మ

మనసుని మీటే రాగం నీవే అయితే చాలు
కన్నుల తొణికే స్వప్నం నీవే అయితే చాలు 

ఊహలలోనే గుండెను తడిపే చెలమవి చెలియా
వలపును జల్లే మేఘం నీవే అయితే చాలు

మోహము పెంచే సుందర రూపం నీదే కాదా
కాముడు పట్టిన చాపం నీవే అయితే చాలు

కాలం గుచ్చే ములుకులతోనే గుండెకు గాయం
బాధను తీసే బాణం నీవే అయితే చాలు

కవితల కన్నెకి అక్షర హారతి పడుతున్నానూ
నా రచనలలో భావం నీవే అయితే చాలు

ముసిరిన చీకటి వేడుక చేసెను ఒంటరి మదిలో
నిశలను చీల్ఛే వెన్నెల ఖడ్గం నీవే అయితే చాలు

అమాస చాయలు దూరం చేయును వె’న్నెలరాజా’
వాకిట వెలిగే పుంజం నీవే అయితే చాలు



20, మార్చి 2016, ఆదివారం

వేటూరి సుందరరామమూర్తి - సంక్రాంతి కవిత



అలనాటి ఆంధ్ర సచిత్రవార పత్రిక లో ప్రచిరితం. నా సేకరణ. ఆట్టమీద బాపు గీసిన బొమ్మ.

ఎన్.టి. రామారావు అభిమాన పాత్ర 'రావణ'

నా అభిమాన పాత్ర - రావణ
ఎన్.టి. రామారావు





















నా అభిమాన చిత్రకారుని రేఖల్లో నా అభిమాన నటుడు తనకు అత్యంత అభిమానమయిన పాత్రలో. నేను ఎప్పుడో దాచుకున్న బొమ్మ పోగొట్టుకున్నాను. ఈ రోజు net లో వెతికి తీసాను. అలనాటి ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో లభించింది. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఇక్కడ post చేస్తున్నాను.

18, మార్చి 2016, శుక్రవారం

మహానటి సావిత్రి

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది తను.
పాదాభివందనాలతో, (సేకరణ ః facebook నందమూరి తారక రామారవు page నుండి)
Like
Comment

17, మార్చి 2016, గురువారం

కన్యాశుల్కం


"ఇదిగో గిరీశం నా తలమీద ఎప్పటికైనా తుమ్మెదలు వాలేట్టు జుట్టు మొలిపించగలవా?" అని పూటకూళ్ళమ్మ అడిగినపుడు అందరికీ హాస్యం కనిపించవచ్చు కానీ నాకు ఆనాటి స్త్రీల దుస్థ్తితి కళ్ళముందు కనబడింది. లేత వయసులోనే డబ్బుకాశపడి కాటికి కాలు చాపిన వృద్ధులకు తమ పిల్లలనమ్మి వారి జీవితాలు నాలుగురోజులకే వసివాడిపోతే .. వారి జీవితాలలో వెలుగారి పోయి.. కళ్ళలో దైన్యం కళ్ళముందు కట్టినట్టు చూపి.. బాల్య వివాహాలను రూపుమాపిన యుగకర్త గురజాడ వెంకట అప్పారావు గారు. ఇటువంటి వారు అందరూ ప్రాతః స్మరణీయులు. యుగకర్తలంటే వీళ్ళు. (facebook 'తెలుగు వెలుగులు' పేజీ నుండి సేకరణ)

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...