సింధూరం దిద్దినదీ నీ కొరకే ప్రియతమా
పాపిటలో గిలిగింతగ తోచిందీ నిట్టూరుపె
నిశ్వాసాల సింధూరం అద్దావని భావించా
('గజల్ సుమాలు' తెలుగు గజల్ సంకలనం పుస్తకంలో ప్రచిరిచితమయిన శ్రీమతి రోహిణి ఉయ్యాల
గజల్స్ నుండి - ఈ గజల్స్ చదివిన తర్వాత గుర్తుకు వచ్చిన నేను గతంలో వేసిన చిత్రం. శ్రీమతి రోహిణి గారికి నా ధన్యవాదాలు)
శ్రీమతి శశికళ ఓలేటి గారు తమ కవిత ద్వారా ఇచ్చిన స్పందన. వారికి నా ధన్యవాదాలు ః
ఏనాటిదీ ప్రేమ?
ఏడు జన్మల కాలమానం…… మన ప్రేమకు కొలమానం కాదేమో………
ఏ మూలనున్నా తిరిగి నీ ప్రేమమాలనై నేను నిన్ను చేరుతున్నానే!!
నీ వియోగ జ్వాల నాశీతల హృదయానికి ఉష్ణ మయూఖమై, వెచ్చదనాన్ని ఇస్తోంది.
అలిగిన నీ ముఖము మీద కోపము, అరుణిమగ నా కపోలాన్ని తాకుతోంది.
చెదరని నా ముంగురులు నన్ను కుదరుగ ఉండనీయడం లేదు.
నా పాపిట, నీ చుంబనం సింధూరమై అలుము కుని నీ కొరకు ఎదురు చూస్తోంది.
నీ కరస్పర్శ కై అలమటించే నా కోమల కరపల్లవములు నీకై తపిస్తూ గోరింటను అలంకరించు కున్నాయి .
వేల మధుర క్షణాలు అరుణ కణాలై, నా బుగ్గల సిగ్గులలో పోగు పడ్డాయి.
వేచి ఉన్నాను సఖా!
మరిచి పోయిన కోపతాపాలు………
మనసు నొచ్చిన ప్రణయ కలహాలు……
మరిగించిన వసంత పున్నమి రాత్రులు………
నా శ్వాసలో ఇంకా సజీవంగా నిశ్వసిస్తున్న జాజి మల్లె పరిమళాలు………
సాక్షీభూతులుగా……నీకై
వేచియున్నా ప్రియా!
పవిత్ర మాంగల్య బంధం సాక్షిగా.
ఓలేటి శశికళ.
5-3-2016.

2 కామెంట్‌లు:
good
ఈ కవిత చదివి నా గుండె మూగగా రోదిస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి