23, మార్చి 2016, బుధవారం

మనసుని మీటే రాగం నీవే - తెలుగు గజల్

RVSS Srinivas గారి గజల్ కి నా బొమ్మ

మనసుని మీటే రాగం నీవే అయితే చాలు
కన్నుల తొణికే స్వప్నం నీవే అయితే చాలు 

ఊహలలోనే గుండెను తడిపే చెలమవి చెలియా
వలపును జల్లే మేఘం నీవే అయితే చాలు

మోహము పెంచే సుందర రూపం నీదే కాదా
కాముడు పట్టిన చాపం నీవే అయితే చాలు

కాలం గుచ్చే ములుకులతోనే గుండెకు గాయం
బాధను తీసే బాణం నీవే అయితే చాలు

కవితల కన్నెకి అక్షర హారతి పడుతున్నానూ
నా రచనలలో భావం నీవే అయితే చాలు

ముసిరిన చీకటి వేడుక చేసెను ఒంటరి మదిలో
నిశలను చీల్ఛే వెన్నెల ఖడ్గం నీవే అయితే చాలు

అమాస చాయలు దూరం చేయును వె’న్నెలరాజా’
వాకిట వెలిగే పుంజం నీవే అయితే చాలు



కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...