ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాకముందు నుంచీ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా సినీరంగాన్ని ఏకం చేసి సహాయకార్యక్రమాలు చేపట్టేవారు. 1977లో దివిసీమ ఉప్పెన సంభవించి దాదాపు 20 వేల మంది చనిపోయారు. వేల కొద్దీ ఇళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ సమయంలో సినీ రంగమంతా కదలివచ్చి ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంది. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఎన్టీఆర్, విడిగా కూడా వ్యక్తిగతంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యక్తిగత విరాళాలు అందించారు.
ఈ ఫోటోలో కెమెరా వైపు చూస్తున్న వ్యక్తి స్వామి ప్రథమానందజీ. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం నిర్ణయం మేరకు 11 గ్రామాలలోని తుఫాను బాదితులలో నిరుపేదలకు 1100 ఇళ్ళను కట్టించే పనిని ఆయన చేపట్టారు. ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి ఎన్టీఆర్ అన్నివిధాలా సహకారం అందించడమే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారని స్వామి ప్రథమానందజీ చాలా చోట్ల ప్రస్థావించారు. అలా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని ఎన్టీఆర్ సందర్శించినప్పటి ఫోటో ఇది.
'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం' అన్న ఎన్టీఆర్ ఆచరణ వాక్యం రాజకీయాల కోసం పుట్టింది కాదు, స్వతహాగా ఎన్టీఆర్ తన జీవితంలో మొదటి నుంచీ ఆచరించి చూపిన మనో సిద్ధాంతం అది.
(Courtesy : Post by Sri Chandrasekhar Kilari in Facebook)
1 కామెంట్:
మంచి విషయం అందించారు !
రామా రావే గదరా
క్షేమము జనులకు సమాజ సేవను తలచెన్
స్వామీ ప్రథమానందులు
నీమము తప్పక జిలేబి నిచటన జెప్పెన్
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి