"తెలియదు నీకు.."
కనిపిస్తూనే ఎంతగ బాధిస్తున్నావో తెలియదు
నీకు
ప్రేమిస్తూనే ఎంతగ వేధిస్తున్నావో తెలియదు
నీకు
శరీరమంతా నువ్వే నరనరాన చొరవగ చొరబడిపోయి
నివసిస్తూనే ఎంతగ ప్రవహిస్తున్నావో తెలియదు
నీకు
రవంత అలికిడి విన్నా అది నువ్వేనేమో నని
పొరబడితే
ఊరిస్తూనే ఎంతగ ఉడికిస్తున్నావో తెలియదు
నీకు
గిరగిర తిరుగుతు నా మది విహంగమయ్యెను
నువ్వు గీచిన గిరిలో
విడిపిస్తూనే ఎంతగ బంధిస్తున్నావో తెలియదు
నీకు
కోపము తాపము మాయం నవ్వేకళ్ళతో నువ్వు
కనపడగానే
సాధిస్తూనే ఎంతగ శోధిస్తున్నావో తెలియదు
నీకు
రేయిపగలు ఒక వింతే నినుతలవని క్షణమొకటి
ఉందంటే
కవ్విస్తూనే ఎంతగ కలహిస్తున్నావో తెలియదు
నీకు
ప్రపంచమంతా నాదని నేను సంబరపడుతూ నీతో ఉండగ
గెలిపిస్తూనే ఎంతగ ఓడిస్తున్నావో తెలియదు
నీకు
(Courtesy : 'గజల్ సుమాలు' - తెలుగు గజల్ సంకలనం - శ్రీమతి జ్యోతిర్మయి మళ్ళ గారి గజల్)
2 కామెంట్‌లు:
మీ రేఖా చిత్రం అమోఘం పొన్నాడ వారు !
నడుమున చేతుల జేర్చన్
సడి సడి జేసెను కురులను సరసపు మోమున్
ఒడి తడి వేదిక నయ్యెన్
విడివడని ఒడులు ఒడుపుగ విరహము దీర్చెన్
చీర్స్
జిలేబి
లబోదిబో లబ్జనకరి. ఓ ప్రేతమా. సారీ. ప్రియతమా.
నీ శ్వాసతో నాకు ఊపిరి తీశావే. అదేంటమ్మా ఈరోజు బ్రష్ చేసుకోలేదా.
బొమ్మ సూపర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి