15, మార్చి 2016, మంగళవారం

ప్రేమ - ఆకాశమంత.


లక్ష్మీ భవాని కంభంపాటి గారి ఆలోచనా సరళికి నా పెన్సిల్ చిత్రం జత చేస్తే ..
  
ఆ ప్రేమ ఆకాశమంత :
.
నా ప్రేమ - నీటి చుక్కలో పుడితే సముద్రమంత పెద్దదవుతుంది
పువ్వు రేకులో పుడితే తోటంత సుందరమవుతుంది
చిరునవ్వులో పుడితే వెన్నెలంత ఆనందమవుతుంది.
నేనే కనుక - నీకు దూరమయితే ...
నా ప్రేమ - ఆకాశమంత విశాలమవుతుంది
వేల కళ్ళతో నిన్ను చూస్తూనే ఉంటుంది...
.
" ప్రేమ ...! " ...
అనుభూతికి సులభంగా అందేదే ...
అయినా ప్రేమను నిర్వచించడం కష్టమే ...
.
మనం పాడుకునే పాటల్లో ...పద్యాల్లో ...గీసే చిత్రాల్లో .... దేవాలయాలలోని అనేక శిల్పాల్లో ...
' ప్రేమే ' ప్రకటితమవుతోంది .
కేంద్ర బిందువుగా ఉంటోంది .
.
ఇంత ప్రయత్నం జరుగుతున్నా ...
మానవుడి జీవితంలో నిజానికి ' ప్రేమకు ' మాత్రం చోటు ఉండడం లేదు .
.
అంతర్లీనంగా ...ప్రేమ మనిషిలోనే దాగి ఉంది .
ప్రేమను ఎలా సృష్టించాలి ...? అన్నది కాదు ప్రశ్న .
దానికి కప్పబడి ఉన్న ముసుగును ఎలా తొలగించాలి అని ఆలోచించడం మనం చేయాల్సిన పని ...!!
నేను - నాది ... అంటున్నంతవరకు ప్రేమ ఉద్భవించడం కష్టం.
వ్యక్తిత్వం మాయమైనప్పుడు మాత్రమే " ప్రేమ జననం సంభవం "

(లక్ష్మీ భవాని కంభంపాటి గారికి ధన్యవాదాలు)
.

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



రెండన అక్షర ప్రేమను
ఖండికలన గాంచిరిగద కవివరులు గనన్
బండల కరిగించును భువి
మండల మందున్ గదోయి మధురిమ జేర్చన్

జిలేబి

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...