(నా దగ్గర ఉన్న కొన్ని అరుదైన బాపు గారి చిత్రాల్ని రంగుల్లో చిత్రీకరించదలిచాను. అందులో భాగంగా అన్నమయ్య, అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన చిత్రాలు వేయ సాహసిస్తున్నాను. మిత్రుల ప్రోత్సాహం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.)
సంతానంలేక తీవ్ర వ్యధకు గురైన భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.
2 కామెంట్‌లు:
చక్కటి ప్రయత్నం. అభినందనలు
హరిసేవలుగా నమరు యత్నములు
హరిసాన్నిధ్యకరంబులు శుభములు
ధన్యవాదాలు. మీ బ్లాగులు ఒకటీఒకటి గా చూస్తాను. తెలుసుకోదగ్గ విషయాలు చాలానే ఉన్నాయి.
మరోసారి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి