2, మార్చి 2016, బుధవారం

స్మృతి ఇరాని = పెన్సిల్ చిత్రం



శ్రీమతి స్మృతి ఇరాని, మానవ వనరుల మంత్రిణి పార్లమెంట్ లో
చేసిన సంచలనాత్మ ప్రసంగానికి facebook మిత్రులు శ్రీ వనం వెంకట
వరప్రసాద్ గారు రచించిన చక్కని పద్యములు. వారికి నా ధన్యవాదాలు.

అమ్మను తిట్టునట్టి యథమాథమ పుత్రుల రూప శత్రువుల్ 
అమ్మల గన్నయమ్మ వెలయా లను జారులు చోరు లూరలన్ 
దిమ్మరులౌ ఉలూకముల దిమ్మ దిరుంగగ సొమ్మసిల్లగన్
అమ్మరొ యో స్మృతీ! పలుకులా? యవి భారత మాత కారతుల్!

భారతదేశ మెవ్వరిది భారతి నమ్మగ నమ్ము వారిదౌ 
భారతి కాదు బానిసల భావము లమ్మను అమ్ము వారికిన్ 
భారత మందు బుట్టి యిట పారెడు గంగల నీళ్ళు ద్రావి
భారతి నాశమౌ ననగ భారత పుత్రులు ఊరకుందురే?

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


ఔరా ! చూడన ముద్దుర !
హోరాహోరి నటు మాట హోరుగ జేసెన్ !
గోరీ లాయెను చదువుల్
ఓరీ , పలుకు జగదంబ నోటి పలుకురా

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పొన్నాడ మూర్తిగారూ !
విన్నామిది , స్మృతియిరాని పెన్సిల్ చిత్రం
బన్నా! జీవకళలతో
పన్నుగ నలరారుచుండె ప్రతభాయుతమై .

SAYIMARGAM చెప్పారు...

స్మృతి ఇరాని యన్న పదంభు నపస్మృతి
గాయెంచు త్రాష్టుల తాటలనూడదెంచి
కృతులనెన్నో సభయందుంచి తనదైన
శైలిలో భరతమాత గౌరవమున్ పెంచే

టి. జి. కమలా దేవి సినీ నటి, స్నూకర్ క్రీడాకారిణి

  టి. జి. కమలాదేవి - my  charcoal pencil sketch, slide created by me.  టి.జి.కమలాదేవి   ( డిసెంబర్‌ 29 ,   1930   -   ఆగస్టు 16 ,   2012 ) (...