12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఎదురుచూపు - పెన్సిల్ చిత్రం




అజంత భావన గారి గజల్ కి నా పెన్సిల్ స్కెచ్

ఎదురుచూపు తరగలన్ని కన్నులలో కూలిపడెను
కలలుకనే ఘడియలన్ని వేకువలో కూలిపడెను
ఆత్మీయత కురిపించగ పలుకుకెంత ఆరాటమొ

నీవురాక మాటలన్ని పెదవులలో కూలిపడెను

నీ జాడలు కొరకువెతికి నా పదములు అలిసినవీ 

నినుచేరక అడుగులన్ని దారులలో కూలిపడెను

నీ పిలుపుల నాదస్వర రాగముకై నే కాచుకుంటి

గర్జించిన మేఘరవళి చినుకులలో కూలిపడెను

కలతనిండి మనసేమో మూగదాయె "అజంతా"

నెరవేరని ఊహలన్ని నిజములలో కూలిపడెను


2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...




వాకిట జిలేబి ఓరగ
దాకుని వేచెను గదోయి తాపము తోడన్ !
ఆ కురు లందము గాంచన్
తూగెను ప్రేమికుడు మన్మధుని గానయటన్ !

అజ్ఞాత చెప్పారు...

బొమ్మ బాగుంది. జిలేబి పద్యం. నా వల్లకాదు బాబోయ్. ఈ వెర్రి పద్యాలు.

కొత్తగ వచ్చినట్టి తన కోడలినెంతయు ప్రేమ జమీరగన్

 నేను చిత్రీకరించిన ఈ చిత్రానికి శ్రీ పాటిబళ్ల శేషగిరి రావు గారు రచించిన పద్యం  "శ్రీ Pvr Murty  గారికి జేజేలతో ఉత్పలమాల (పంచపాది) కొత్...