20, ఏప్రిల్ 2016, బుధవారం

గాజులు - తెలుగు గజల్


సత్యనీలహంస (నిడిమామిడి వీరమూర్తి) గారి గజల్ కి నా బొమ్మ
(గజల్ సుమాలు పుస్తకం నుండి సేకరణ)

ఎదురుచూపులో మౌనంగా అలుగుతాయి ఈ గాజులు
ఎదురైతేచాలు పలకరింపుతో వెలుగుతాయి నీ గాజులు

ఆకాశమంత మంచిమనసు చేసుకున్న చేతులకై
హరివిల్లు లోని రంగులని పొందుతాయి నీ గాజులు

బుంగమూతి మోముతో నీవలిగిన వేళలో 
పలుకలేక మూగ సైగలు చేస్తాయి నీ గాజులు

చాటులో నిచ్చాటులో చీకట్లలోనూ చిలిపిగా
సవ్వడితో సంగతులెన్నో చెబుతాయి నీ గాజులు

పనులుచేస్తూ పలుకరించే పరామరికల ప్రేమతో
నీ రాక సందేశాన్ని చేరవేస్తాయి నీ గాజులు

ప్రేమతో నీ చేతులపై ముద్దాడిన వేళలో
పరవశం తో చప్పట్లని చరుస్తాయి నీ గాజులు

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...