30, ఏప్రిల్ 2016, శనివారం

మహాకవి శ్రీశ్రీ


నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా ఆ మహాకవి కి నా నివాళి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన  గారి కవిత ' ఓ మహాత్మా ఓ మహర్షీ' ఈ క్రింది లింక్ క్లిక్ చేసి విందాం.



నేను వేసిన శ్రీశ్రీ గారి బొమ్మకి మిత్రులు ప్రసాద్ కట్టుపల్లి గారు వ్రాసిన పద్యాలు. వారికి నా ధన్యవాదాలు.

ఆ.వె
పేద ప్రజల కొరకు పేర్మితో వ్రాసెను
కమ్మ నైన మంచి కవిత లెన్నో
అరస విరస ములకు నాధ్యుడై నిలచెను
కూలి నాలి జనుల గోడు దెలిపె
ఆ.వె
సింహగర్జనలతొ సింహనాదముజేసె
శ్రామికులకు దెలిపె శాసనములు
రైతు కూలి జనుల రైతాంగ యిడుములు
వచన కవిత లోన బలికె తాను
ఆ,వె
తాజ మహలు యంచు తరతరములనెంచి
చదువు జెప్పు మీరు జక్కగాను
రాళ్ళు మోసె నేమి రాజులు నెపుడైన
కట్టె నెవరు యమున గట్టు ననెను
ఆ,వె
పాప మెవ్వరిదని ప్రశ్నించె ఘాటుగా
ముక్కకొరుకు కొనెడి కుక్క జూపె
ఎర్రని కాంతి నెగయనిలమహాప్రస్థాన
మెంతొ చెడును మనకు మెత్తి జూపె
ఆ.వె
అంతు లేని హృదయ, ఆవేదన బడసె
పేద జనుల నెపుడు వీడ కీవు
పోరుబాట నడిపె పోరాట యోధుడా
అందు కొనుము నాదు వందనములు

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...