16, ఏప్రిల్ 2016, శనివారం

అమృతవాహిని - నవల

నేను వేసిన ముఖచిత్రం తో విడుదలయిన శ్రీమత్ సుజల గంటి గారి నవల "అమృతవాహిని". మంచి నవల. చదవండి. ఈ పుస్తకం ఈ  ONLINE లో kINIGE లో లభ్యం.

'ఇండియా'లో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని కళ్లకు కట్టిస్తే, అమెరికాలో జరిగిన కథ మనని అమెరికా తిప్పి చూపిస్తుంది.
అమృతవాహిని
ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు. స్త్రీ దృష్టిలో వేరు. ఆ స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం గలిగిన 'అమ్మ' అయినప్పుడు ఆమె దృష్టిలోని లోకం ఎలా ఉంటుందో యీ 'అమృతవాహిని' నవల మనకి కళ్లకి కట్టినట్టు చెబుతుంది. ఇందులో పచ్చి స్వార్థపరుల విన్యాసాలున్నాయి. స్నేహహస్తం జాచే స్వచ్ఛమానవుల అడుగుజాడలున్నాయి. ఊరుగాని ఊళ్లో, దేశంగాని దేశంలో 'నేనున్నాను' అని ధైర్యం చెప్పే అమృతహస్తాలూ ఉన్నాయి. 'ఇండియా'లో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని కళ్లకు కట్టిస్తే, అమెరికాలో జరిగిన కథ మనని అమెరికా తిప్పి చూపిస్తుంది.
అంతేకాదు... అక్కడి మన తెలుగువారి కష్టాలూ, కన్నీళ్లు, స్వార్థాలూ, స్నేహాలూ, అహంకారాలూ, మమకారాలూ అన్నీ చిరుగాలుల తెరల్లా మన మనసుని తాకుతూ మరో లోకానికి తీసుకుపోతాయి. నాకొకటి అనిపించింది... రచయిత్రి యొక్క సంస్కారము, పుట్టి పెరిగిన విధానమే పాత్రలను మలుస్తుందని. 'అమృతవాహిని'లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తుల కోపాన్నీ, ద్వేషాన్నీ కూడా ఓ పరిధిలోనే ఉంచారు గానీ, 'రాత'లో అసహనాన్ని ఎక్కడ చూపలేదు.
                                                          - భువనచంద్ర, సినీ గేయ రచయిత

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...