4, ఏప్రిల్ 2016, సోమవారం

అదిగో ఆ నవ్వే నన్ను కట్టి పడేసింది - తెలుగు గజల్ - పెన్సిల్ చిత్రం

అదిగో ఆ నవ్వే నన్ను కట్టి పడేసింది
విసిరే ఆ చూపే కనుగొట్టిపడేసింది

కదిలే అలలా నువు ఎటో కదిలిపోతుంటే
వలపు అనే తుమ్మెద నను కుట్టి పడేసింది

పగలే వెన్నెల్లు కురిసి మురిసిపోతుంటే
మెరిసే నీ రూపం ఎద తట్టిపడేసింది

దివిలో ఈ అందం ఓర్వలేకపోయారా
ఎవరో ఆ దైవం మన గట్టి ముడేసింది

మనకూ ఈడూరి తగు సమయమొచ్చిందిలే
ఎదలో అణువణువూ తను చుట్టిపడేసింది

(మిత్రులు Srinivas Iduri గారి తెలుగు గజల్  కి నా బొమ్మ - గజల్ సేకరణ ః 'గజల్ సుమాలు' పుస్తకం నుండి)

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...