27, ఏప్రిల్ 2016, బుధవారం

పిచుకలు - తెలుగు గజల్


ఈ వారం 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో శ్రీమతి Umadevi Prasadarao Jandhyala గారి 'పిచుకలు' గజల్ కి బొమ్మలు.
వీడక తిరిగే పిచ్చుక జంటల అనురాగమునే చూడముచ్చట!
గూడునుకట్టగ పోచలు తెచ్చే సహనగుణమునే చూడముచ్చట !
బుడిబుడి అడుగుల మెతుకులకోసం నడిచేతీరే నవ్వొస్తుంది
ఈఇల్లంతా నాదేఅనుకొను తులిపి తనమునే చూడ ముచ్చట !
ఏదో చాలా పనిఉన్నట్లుగ ఒక్కచోటఒక క్షణంనిలవవు
కిటికీగుండా రివ్వునదూరే సామర్ధ్యమునే చూడముచ్చట !
వానకుతడిసిన పిచ్చుక చూసిన మాపాపాయికి ఎంతటి జాలి!
తుడుచుకోమంటు తుండును తెచ్చిన ఔదార్యమునే చూడముచ్చట!
ఇంకోపిచ్చుక వచ్చిందనుకొని అద్దంముందర తగవుదానికి
పిల్లలందరికి మళ్ళీమళ్ళీ ఆదృశ్యమునే చూడముచ్చట !
వాలుకుర్చీల వార్ధక్యాలకు పలకరింపులీ కిచకిచేగద!
తగవులు ఎరుగని జోడుపిచ్చుకల దాంపత్యమునే చూడముచ్చట!
ఎటుపోతుందో ఏంతెస్తుందో పెంపకమంతా మగపిచ్చుకది
గుడ్లను పొదిగీ పిల్లలగాచే ఆలితనమునే చూడముచ్చట !
కాపురాలలో కాపురముండే ఈచుట్టాలకు చోటుంచాలి
కనుమరగయ్యే పిచ్చుక సంతతి ఉద్ధరణమునే చూడముచ్చట!

2 కామెంట్‌లు:

vahini చెప్పారు...

పాట ఎంత బాగుందో మీ బొమ్మ అంత బాగుంది.

Ponnada Murty చెప్పారు...

ధన్యవాదాలండీ

ఫిల్టర్ కాఫీ

  Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch. దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించ...