9, ఏప్రిల్ 2016, శనివారం

తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు - బాపు బొమ్మ


అలనాటి ఆంధ్రపత్రికలో 'తెలుగు వెలుగులు' శీర్షికలో వచ్చిన కీ. శే. తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారి వ్యాసానికి బాపు గారు వేసిన బొమ్మ. ఆ వ్యాసం లో కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ క్రోడీకరించాను.

"ఆంగ్ల వాంగ్మయంలో శామ్య్ల్లూల్ జాన్సన్ కున్న ఉన్నత స్థానంలాంటిది, ఆంధ్ర వాంగ్మయం ఒకే ఒకరికి దక్కిందనీ, ఆ ఒక్కరూ శ్రీ తల్లావజ్జల శివశంకరశాస్త్రి గారనీ అనేవారు. శ్రీ శాస్త్రి గారికి ఆ స్థానం దానికి అది రాలేదు. దాన్ని ఆశించారు. దానికోసం కృషి చేశారు. ఉత్సాహోద్రేకాలుగల పదిమంది పిన్నలను దగ్గరకు చేర్చారు. వారిని ఒక బాటపై నడిపించారు. వారి ఆ ఘనత మరువరానిది, మరపురానిమి; చెరిగిపోనిది.

శ్రీ శాస్త్రి గారు పండితులు. బహు గ్రంధ ద్రష్ట. పాద ప్రక్షాళనం దగ్గర నుండి పతంజలి కుండలీయోగం దాకా అ విషయాన్నైనా తమ సంత ఫక్కీలో చెప్పగల యోగానందులు.
      ...                            ....                .....                 ...           ....                       ....

కవితా ప్రాంగణంలోకి చొరబడాలని వచ్చిన ఉత్సాహపరులను ఆయన ప్రోత్సహించకుండా వదలలేదు. సాహిత్యపరంగా ఈ పనిని సాధిస్తామని వచ్చినవారిని ఆశీర్వదించక వదలలేదు. సాహిత్య సభలకు అండగా నిలబడకుండా ఉండలేదు."
ఈ క్రింది లింకు క్లిక్ చేసి ఆంధ్రబారతి.కామ్ లో ప్రచిరితమయైన వారి వ్యాసం చదువుదాం.

http://www.andhrabharati.com/kavitalu/SiShTlA/viShNudhanuvu/viShNudhanuvu_pIThika.html

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...