13, ఏప్రిల్ 2016, బుధవారం

సమ్మెట అంబా ప్రసాద్ - హార్మోనియం విద్వాంసుడు - చిత్రం : బాపు

సమ్మెట అంబా ప్రసాద్ ప్రముఖ హార్మోనియం విద్వాంసుడు. హార్మోనియంను ప్రజాదరణతో బాటుగా శాస్త్రీయమైన గౌరవమూ చేకూరడానికి నిరవధికంగా పాటుబడిన వారిలో ప్రముఖుడు అంబా ప్రసాద్. వేరొక విధంగా చెప్పాలంటే తెలుగునాట సంగీత ప్రపంచంలో ప్రవేశం ఉన్నవారందరికీ మారుపేరే శ్రీ అంబాప్రసాద్.  సమ్మెట వారు 1905 లో తణుకులో మాతామహుల ఇంట జన్మించారు. తల్లి శ్రీమతి సీతమ్మగారి కడుపుచలవ - నలుగురు కుమారులూ సంగీత విద్వాంసులే. సమ్మెట వారి జ్యేష్ట భ్రాత వెంకటరావు గారూ, తమ్ముడూ హార్మోనియం నిపుణులే.. (అలనాటి ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికల సంచికల నుండి సేకరణ - చిత్రకారుడు 'బాపు'. ఇంకా వీరి గురించి వికీపీడియా వారు ఇలా అంటున్నారు ః


వీరు చిన్నతనంలో తన సోదరుడు వెంకటరావు వద్దను తర్వాత నిజాం ఆస్థాన విద్వాంసులైన హరి రామచంద్రరావు గార్ల వద్ద హార్మోనియం నేర్చుకున్నారు. విశేషమైన కృషిచేసి, హిందూస్థానీ సంగీత విద్వాంసులైన అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ ఫయ్యజ్ ఖాన్ లకు వాద్య సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. వీరు ఆంధ్ర దేశంలో పలు కచేరీలు చేశారు. మచిలీపట్నంలో వీరు హరి నాగభూషణం గారి ద్వారా సువర్ణ ఘంటా కంకణం పొందారు.

కామెంట్‌లు లేవు:

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్

  కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గ...